ఇదేందయ్యా ఇది..! ఈ హీరోయిన్ ఇంత మారిపోయింది..!! సినిమాలు మానేసి ఇలా
తెలుగులో నాగార్జున, మంచు మనోజ్, కల్యాణ్ రామ్ తదితర హీరోలతో నటించింది. అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌ల సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుందీ అందాల తార.

మంచు మనోజ్ ఇప్పుడంటే సినిమాల స్పీడ్ తగ్గించాడు కానీ ఒకప్పుడు యమా స్పీడ్ గా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకునేవాడు. మనోజ్ సినిమాలు యూత్ ను విశేషంగా ఆకట్టుకునేవి.. మనోజ్ నటించిన సినిమాల్లో మిస్టర్ నూకయ్య సినిమా ఒకటి. అని కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో మనోజ్ తన నటనతో స్టంట్స్ తో ఆకట్టుకున్నాడు. కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించారు. వారిలో ఒకరు బాలీవుడ్ భామ కృతి కర్బందా కాగా మరొకరు సనా ఖాన్. కృతి కర్బందా ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో ఒకటి రెండు సినిమాలు కూడా చేసింది. అయితే సనా ఖాన్ మాత్రం ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. దాంతో ఆమె ఏమైంది.? ఎక్కడుంది అంటూ నెటిజన్స్ తెగ గాలిస్తున్నారు.
సనా ఖాన్ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించింది. పలు సూపర్ హిట్ సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్‌లోనూ ఆడిపాడింది. హిందీ బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. అంతేకాదు వివాహానికి ముందే సినిమాలకు గుడ్ డై చెప్పేసి అభిమానులను షాక్ కు గురిచేసింది. ఆ వెంటనే తన సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న సినిమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను డిలీట్ చేసింది. పెళ్లి తర్వాత పూర్తిగా ఆధ్యాత్మిక భావనలోనే మునిగిపోయింది సనాఖాన్. ముంబైకు చెందిన సనాఖాన్ కల్యాణ్ రామ్ కత్తి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత నాగార్జున గగనం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచు మనోజ్ తో కలిసి మిస్టర్ నూకయ్య సినిమాలోనూ నటించింది.
పలు తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో నూ నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది. హిందీలో అయితే సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ల సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. 2019లో విశాల్ నటించిన అయోగ్య సినిమాలో చివరి సారిగా కనిపించింది. ఆతర్వాత ఉన్నట్లుండి సినిమాల నుంచి తప్పుకుంది సనాఖాన్. దుబాయ్ కు చెందిన అనస్ సయ్యద్ తో కలిసి నిఖా పక్కా చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులకు సయ్యద్ తారిఖ్ జమీల్ అనే బాబు. ఎక్కువగా ఆధ్యాత్మిక యాత్రలో మునిగి తేలుతోన్న సనాఖాన్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పూర్తి దూరంగా ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ప్రస్తుతం సనాఖాన్ ఫ్యామిలీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
