Ram Gopal Varma: మరోసారి టికెట్స్ రేట్స్ పై వర్మ సంచలన వ్యాఖ్యలు.. ఆ డైరెక్టర్‏కు రివార్డ్ ఇవ్వాలంటూ..

ప్రస్తుతం సినీ పరిశ్రమలో టికెట్స్ రగడ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలపై సినీ ప్రముఖులు అసహనం

Ram Gopal Varma: మరోసారి టికెట్స్ రేట్స్ పై వర్మ సంచలన వ్యాఖ్యలు.. ఆ డైరెక్టర్‏కు రివార్డ్ ఇవ్వాలంటూ..
Ram Gopal Varma
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 30, 2021 | 8:39 PM

ప్రస్తుతం సినీ పరిశ్రమలో టికెట్స్ రగడ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలపై సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు తెలంగాణలో టికెట్స్ రేట్స్ పెంచడంలో స్టార్ హీరోస్..డైరెక్టర్స్ ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలుపగా.. చిన్న సినిమా నిర్మాతలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. టికెట్స్ రేట్స్ పెంచడం వలన పెద్ద సినిమాలు మాత్రమే బాగుపడతాయని.. చిన్న సినిమాలు కోలుకోలేవంటూ నిర్మాత నట్టికుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ఏపీలో టికెట్స్ రేట్స్ తగ్గించడంతో ప్రభుత్వానికి, సెలబ్రెటీలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టికెట్స్ రేట్స్ తగ్గించడంతో సినీ పరిశ్రమ మరింత నష్టపోయే ప్రమాదముందని వాపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ టికెట్ రేట్స్ ఇష్యూపై రామ్ గోపాల్ వర్మ ఇటీవల సెన్సెషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

వస్తువును తయారు చేసిన ఉత్పత్తిదారుడికి దాని రేట్ నిర్ణయించే అధికారం ఉన్నట్లే సినిమా నిర్మించిన నిర్మాతకు టికెట్ రేట్ నిర్ణయించే హక్కు ఉంటుందని.. సినిమా టికెట్స్ పై ప్రభుత్వ పెత్తనమెంటీ అంటూ ప్రశ్నించారు. తాజాగా ఆర్జీవి మరోసారి సినిమా టికెట్స్ రేట్స్ ఇష్యూ పై స్పందించారు. ఈ క్రమంలో డైరెక్టర్ రాజమౌళిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు వర్మ. హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ స్పైడర్ మ్యాన్ కు పెట్టిన ఖర్చులో 100వ వంతుతో రాజమౌళి బాహుబలి సినిమా తీశాడు. ఈ సినిమాతో హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీని మించిన రెస్పాన్స్ తెచ్చుకుందని ప్రూవ్ చేశాడు.

ప్రొడ్యూసర్ తో ఖర్చు పెట్టించడంలో ఆరోజు తెలుగు సినిమాకు ఉన్న కెపాసిటీని రెండు, మూడంతలు చేస్తూ ధైర్యం చేశారు. అది ప్లాప్ అయితే నిర్మాత నష్టపోతాడు. రాజమౌళి కాస్త బ్రాండ్ తగ్గుతుంది. కానీ అది సక్సెస్ కావడం వలన ఈరోజు తెలుగు సినిమా గురించి యావత్ ప్రపంచం మాట్లాడుతుంది. మంచి సినిమా చేస్తే సక్సెస్ అవుతుందని రాజమౌళి నిరూపించడంతో కేజీఎఫ్, పుష్ప వంటి సినిమాలకు దారి చూపించాడు. దీంతో ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుతుంది. టాక్స్ రూపంలో ప్రభుత్వానికి లాభం వస్తుంది. అందుకే నా ఉద్ధేశ్యం ప్రకారం ఇలాంటి టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం టాక్స్ బెనిఫిట్ ఇవ్వాలి. టికెట్స్ రేట్స్ తగ్గించడం పక్కనపెట్టి రాజమౌళికి రివార్డ్ ఇవ్వాలన్నారు ఆర్జీవి. తెలుగు రాష్ట్రాలకు రాజమౌళి చేసిన సేవను డబ్బుతో కొనలేమని.. ఆ ఘనత ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు వర్మ.

Also Read: Viral Photo: ఈ హీరోయిన్‏కు తెలుగులో ఫుల్ క్రేజ్.. జూనియర్ సౌందర్య అనేస్తుంటారు.. ఎవరో గుర్తుపట్టారా ? ..

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌గా తెలుగు, తమిళ్‌లో దూసుకుపోతుంది… గుర్తుపట్టారా..?

Sudheer Babu: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటున్న సుధీర్ బాబు.. అందమైన ప్రేమ కథగా రాబోతున్న సినిమా..

Year Ender 2021: ఈ ఏడాది దుమ్మురేపిన మాస్‌ మసాలా సాంగ్స్‌.. ఊ అంటావా అంటూ.. ప్రేక్షకులను ఊపేశాయి..