AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: ది కేరళ స్టోరీ క్రేజీ కామెంట్స్ చేసిన ఆర్జీవీ.. అలాంటివే హిట్ అవుతాయి అంటూ..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆర్జీవీ .. చాలా సంచలన పోస్ట్ లు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ది కేరళ స్టోరీ’ సినిమా గురించి మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2023లో విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై పలువురు ప్రముఖులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. నసీరుద్దీన్ షా, కమల్ హాసన్ తదితరులు ఈ సినిమాపై విమర్శలు చేశారు.

Ram Gopal Varma: ది కేరళ స్టోరీ క్రేజీ కామెంట్స్ చేసిన ఆర్జీవీ.. అలాంటివే హిట్ అవుతాయి అంటూ..
Rgv
Rajeev Rayala
|

Updated on: Aug 05, 2024 | 7:16 AM

Share

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం చేసిన అది వైరల్ అవుతుంది. ఒకప్పుడు టాలీవుడ్ ను షేక్ చేసే సినిమాలు చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు కాస్త విభిన్నంగా రొమాంటిక్ సినిమాలు చేస్తున్నారు. అలాగే బోల్డ్ సినిమాలు చేస్తుంన్నారు ఆర్జీవీ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆర్జీవీ .. చాలా సంచలన పోస్ట్ లు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ది కేరళ స్టోరీ’ సినిమా గురించి మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2023లో విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై పలువురు ప్రముఖులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. నసీరుద్దీన్ షా, కమల్ హాసన్ తదితరులు ఈ సినిమాపై విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

కేరళ స్టోరీ సినిమా విషయంలో చాలా సంతోషంగా ఉంది. చాలా ఏళ్లుగా నేను చూసిన సినిమాల్లో ఇదొకటి. సినిమా చూసిన తర్వాత దర్శకుడు, నిర్మాత, హీరోయిన్ అదా శర్మతో మాట్లాడాను. కానీ అదే టీమ్ చేసిన మరో సినిమా విడుదలైంది. దాని గురించి నాకు తెలియదు. అందరూ ఆ సినిమాను పట్టించుకోలేదు. దీన్ని ఎలా వివరించగలం’ అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

‘ది కేరళ స్టోరీ’ సినిమా 300 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. ఇలాంటి సినిమాలు హిట్ అవ్వడం చాలా ప్రమాదకరం అని ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా అన్నారు. అయితే రామ్ గోపాల్ వర్మకు అలాంటి సినిమాలంటే ఇష్టం. వర్మ సినిమాలు తీసే విధానం, సినిమాలను చూసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కేరళ స్టోరీస్ మూవీ గురించి వర్మ మాట్లాడుతూ.. ఎ.ఆర్. రెహమాన్ చెప్పిన విషయం చేసుకున్నారు. ‘చాలా కాలం క్రితం ఎ.ఆర్. రెహమాన్‌ ఈ విషయాన్ని నాకు చెప్పారు. ఈ సంవత్సరం అతిపెద్ద హిట్‌గా భావించే ట్యూన్‌ను ప్రజలు విస్మరిస్తారు. ఇది చెడ్డదని ప్రజలు కూడా అనరు. అలాంటి పాటే లేదన్నట్లుగా మాట్లాడతారు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి.. నా హిట్ సినిమాలన్నీ అనుకోకుండా జరిగినవే. ఫ్లాపులన్నీ పర్పస్ ఫుల్ గా ఉంటాయి’ అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.