AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Game Changer: గేమ్ ఛేంజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రామ్ చరణ్ కోసం శంకర్ భారీ ప్లాన్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ స్టార్టై చాలా కాలం గడుస్తున్నా.. ఇప్పటివరకీ ఫ్యాన్స్ ఆశించిన రేంజ్‏లో అప్డేట్స్ రిలీజ్ కాలేదు. ఇప్పటికే విడుదలైన చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్.. జరగండి సాంగ్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి.

Game Changer: గేమ్ ఛేంజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రామ్ చరణ్ కోసం శంకర్ భారీ ప్లాన్..
Ram Charan
Rajitha Chanti
|

Updated on: Jun 06, 2024 | 3:04 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ స్టార్టై చాలా కాలం గడుస్తున్నా.. ఇప్పటివరకీ ఫ్యాన్స్ ఆశించిన రేంజ్‏లో అప్డేట్స్ రిలీజ్ కాలేదు. ఇప్పటికే విడుదలైన చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్.. జరగండి సాంగ్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది. లేటేస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ జూన్ నెలాఖరు వరకు ముగుస్తుందట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని.. ఇంకా పదిరోజుల్లోనే గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ కానుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులతోపాటు.. ప్రమోషన్స్ కూడా షూరు చేయనున్నారని.. ఫ్యాన్స్ కోసం వరుస అప్డేట్స్ రివీల్ చేయడం ఖాయమంటున్నారు.

ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నా్రు. ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. అటు ఐఏఎస్ అధికారిగా.. అలాగే రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే చరణ్ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తున్న ఫోటోస్ నెట్టింట లీక్ అయ్యాయి. అలాగే ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.

గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ తన కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ తన తదుపరి సినిమా చేయనున్నారు. ఆర్సీ 16 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించనుంది. జూన్ చివరి వారంలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..