Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush-Ram Charan: ధనుష్ డైరెక్షన్‏లో రామ్ చరణ్.. ఇక థియేటర్లు దద్ధరిల్లాల్సిందే..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరసుగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ మరోవైపు దర్శకుడిగానూ రాణిస్తున్నారు. ప్రస్తుతం కుబేర చిత్రీకరణలో బిజీగా ఉన్న ఆయన.. ఇటీవలే జాబిలమ్మా నీకు అంత కోపమా సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు మెగా హీరోతో కలిసి మరో సినిమాను రూపొందించేందుకు సిద్ధమయ్యారట.

Dhanush-Ram Charan: ధనుష్ డైరెక్షన్‏లో రామ్ చరణ్.. ఇక థియేటర్లు దద్ధరిల్లాల్సిందే..
Dhanush, Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 01, 2025 | 12:53 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ హీరోకు విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. అలాగే హిందీలోనూ పలు సినిమాలతో అలరించాడు ధనుష్. తుళ్లువతో ఇలామై సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ధనుష్.. ఇప్పటివరకు అనేక హిట్ చిత్రాలతో అడియన్స్ ముందుకు వచ్చాడు. హీరోగానే కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇన్నాళ్లు తమిళంలో వరుస సినిమాల్లో నటించిన ధనుష్.. ఇటీవలే సార్ సినిమాతో నేరుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాతో దర్శకుడిగా మరో సక్సెస్ అందుకున్నాడు. తాజాగా మరో సినిమాను రూపొందించేందుకు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తుంది.

జాబిలమ్మా నీకు అంత కోపమా సినిమా తర్వాత ధనుష్, అజిత్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే దీని గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ధనుష్ కొత్త సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ధనుష్ తెరకెక్కించే కొత్త సినిమాలో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించనున్నట్లు టాక్. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన చరణ్.. ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నాడు. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు ధనుష్ దర్శకత్వంలో చరణ్ నటించనున్న సినిమాపై క్యూరియాసిటి నెలకొంది. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా గురించి త్వరలోనే అప్డేట్స్ రానున్నాయట. ప్రస్తుతం ధనుష్ కుబేర, ఇడ్లీ కడై చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే ‘తేరే ఇషాక్ మైన్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కృతి సనన్ ప్రధాన పాత్రలో నటిస్తుంది.

ఇది చదవండి :  Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..

Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..

Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..

ఫ్యూచర్ సిటీలో రూ.1,000కోట్లతో నెక్ట్స్ జనరేషన్ పార్క్‌..!
ఫ్యూచర్ సిటీలో రూ.1,000కోట్లతో నెక్ట్స్ జనరేషన్ పార్క్‌..!
వక్ఫ్ బోర్డులో కొత్తగా నియామకాలు చేపట్టొద్దు: సుప్రీం కోర్టు
వక్ఫ్ బోర్డులో కొత్తగా నియామకాలు చేపట్టొద్దు: సుప్రీం కోర్టు
పెళ్లి ఫోటోస్ షేర్ చేసిన నటి అభినయ..
పెళ్లి ఫోటోస్ షేర్ చేసిన నటి అభినయ..
10 రూపాయల నాణెంలోని ఈ బంగారు రంగు..! ఎలా వచ్చిందో తెలుసా..?
10 రూపాయల నాణెంలోని ఈ బంగారు రంగు..! ఎలా వచ్చిందో తెలుసా..?
షో కోసం అనుకునేరు.. వీటి ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
షో కోసం అనుకునేరు.. వీటి ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
కార్ల ప్రియులను ఆకర్షిస్తున్న సన్‌రూఫ్ కార్లు..టాప్-5 కార్లు ఇవే
కార్ల ప్రియులను ఆకర్షిస్తున్న సన్‌రూఫ్ కార్లు..టాప్-5 కార్లు ఇవే
ఆ 3 జట్లకు అగ్నిపరీక్ష.. ప్లేఆఫ్స్ చేరే తొలి జట్టు ఇదే..
ఆ 3 జట్లకు అగ్నిపరీక్ష.. ప్లేఆఫ్స్ చేరే తొలి జట్టు ఇదే..
ఒకే వార్డులో పనిచేస్తున్న ఆరుగురు నర్సులకు బ్రెయిన్‌ ట్యూమర్‌!
ఒకే వార్డులో పనిచేస్తున్న ఆరుగురు నర్సులకు బ్రెయిన్‌ ట్యూమర్‌!
అద్భుతమైన స్కీమ్‌.. ప్రతినెలా రూ.9250.. గ్యారెంటీ రిటర్న్స్!
అద్భుతమైన స్కీమ్‌.. ప్రతినెలా రూ.9250.. గ్యారెంటీ రిటర్న్స్!
మీరట్‌ మరో దారుణం..ప్రియుడి కోసం భర్తను భార్య ఏం చేసిందో తెలుసా?
మీరట్‌ మరో దారుణం..ప్రియుడి కోసం భర్తను భార్య ఏం చేసిందో తెలుసా?