Upasana: అయోధ్య రాముడి సేవలో ఉపాసన.. భక్తుల కోసం ఉచిత వైద్య సేవలు ప్రారంభం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రస్తుతం ఆధ్యాత్మిక సేవలో బిజీగా గడుపుతోంది. తాజాగా ఆమె అయోధ్య రాముడిని దర్శించుకుంది. అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంది.
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది. రాముడు కొలువైన అయోధ్యలో అపోలో అపోలో ఎమర్జన్సీ కేర్ సెంటర్ ను ప్రారంభించిందామె. ఈ కేర్ సెంటర్ ద్వారా అయోధ్య రామమందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు మెగా కోడలు తెలిపింది. తాజాగా అయోధ్య రాముడిని దర్శించుకున్న ఆమె అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఉపాసన.. ‘ సనాతన ధర్మం గురించి మా తాత చాలా నేర్పించారు. అయోధ్యలో సేవ చేసే అవకాశం లభించడం మాకు గొప్ప ఆశీర్వాదం లాంటిది. తాతయ్య మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామమందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం. ఇప్పటికే తిరుమల, శ్రీశైలం, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లో అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ద్వారా భక్తులకు ఉచిత సేవలు అందిస్తున్నాం. ఇప్పుడు రామ జన్మభూమిలో సేవ చేయడం అదృష్టం. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అని పేర్కొంది ఉపాసన.
ప్రస్తుతం మెగా కోడలు షేర్ చేసిన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఉపాసన చాలా మంచి పని చేస్తుందంటూ మెగా అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది.
అయోధ్య రామ మందిరం వద్ద ఉపాసన..
Thatha taught us that true Sanatan Dharma for us lies in healing with dignity & empathy. Inspired by his words we opened a free Emergency Care Centre at the Ram Mandir in Ayodhya. After successfully serving in Tirumala, Srisailam, Kedarnath, and Badrinath, we are blessed to… pic.twitter.com/YcCVf0ZM61
— Upasana Konidela (@upasanakonidela) December 15, 2024
ఉపాసన కూతురు క్లింకార..
Klin Kaara is truly blessed to join her Great Grandparents at the Sri Venkateswara Swamy Vari Pavithrotsavamulu at @HospitalsApollo temple today. Seeing her in her Thatha’s arms reminds me of my childhood 🥰 This temple holds a very special place in my heart, and this moment =… pic.twitter.com/WM2qpzsYSU
— Upasana Konidela (@upasanakonidela) December 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.