Ram Charan: ఉపాసన చేయి పట్టుకుని నడిపించిన రామ్ చరణ్.. శర్వా రిసెప్షన్‌లో స్పెషల్ అట్రాక్షన్ గా లవ్లీ కపుల్
టాలీవుడ్‌లో ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన జోడీ. 2012లో పెళ్లిపీటలెక్కిన వీరు సుమారు పదేళ్ల తర్వాత అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు. ఉపాసన త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.

టాలీవుడ్‌లో ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన జోడీ. 2012లో పెళ్లిపీటలెక్కిన వీరు సుమారు పదేళ్ల తర్వాత అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు. ఉపాసన త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈక్రమంలో మెగా వారసుడు/ వారసురాలి కోసం ఆ కుటుంబంతో పాటు అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక గర్భంతో ఉన్న ఉపాసనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటోంది మెగా ఫ్యామిలీ. ఆమె డెలివరీ కోసం ప్రత్యేకంగా విదేశౄల నుంచి గైనకాలజిస్టులను తీసుకురానున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ అనుక్షణం తన భార్య వెంటే ఉంటున్నాడు. ఉప్సీ మొదటిసారి తల్లికానుండడంతో షూటింగ్‌ల నుంచి కూడా విరామం తీసుకుని మరీ తన సతీమణిని చూసుకుంటున్నాడు. కాగా తాజాగా రామ్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్ శర్వానంద్ రిసెప్షన్‌కు జంటగా హాజరయ్యారీ లవ్లీ కపుల్. ఈ సందర్భంగా ఉపాసన చెయ్యి పట్టుకొని రామ్‌చరణ్ నడిపించిన తీరు అక్కున్న వారందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘క్యూట్ కపుల్, లవ్లీ కపుల్’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కాగా శర్వా పెళ్లి పెళ్లి జైపూర్ లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే అక్కడికి ఉపాసనను తీసుకెళ్లడం కష్టమవుతుంది కాబట్టి చరణ్ ఒక్కడే వెళ్లి వచ్చాడు. అయితే రిసెప్షన్ కు మాత్రం జంటగా హాజరయ్యారు. ఇద్దరూ కలిసి వెళ్లి శర్వా దంపతులను ఆశీర్వదించారు. ఇక శర్వా రిసెప్షన్‌కు ముందే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం వేడుకలోనూ సందడి చేశారు చెర్రీ దంపతులు. వరుణ్- లావణ్య ఉంగరాలు మార్చుకున్నాకా.. ఉపాసన తో కలిసి శర్వా రిసెప్షన్ కు వెళ్లిపోయాడు చరణ్. అలా మొత్తానికి తమ్ముడు ఎంగేజ్‌మెంట్, ఫ్రెండ్ రిసెప్షన్‌ను కవర్ చేశారీ లవ్లీ కపుల్. ఈ సందర్భంగా సింపుల్ డ్రెస్ లో చరణ్.. గ్రీన్ కలర్ డిజైనర్ డ్రెస్ లో ఉపాసన చూడముచ్చటగా ఉన్నారు.




#RamCharan #Upasana Latest Pics @ImSharwanand @Rakshitha Wedding reception and blessed the lovely couple. ??#SharwaRakshitaWedding #Sharwanand pic.twitter.com/OHB3qFbEjM
— Sathish Dandaveni (@UrsDandaveni) June 9, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




