Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్‌తో మనసు మార్చుకున్న రామ్ చరణ్.. ‘పెద్ది’ పోస్టర్‌లో ఇది గమనించారా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది.

ఈ ఏడాది సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమాతో మన ముందుకు వచ్చాడు రామ్ చరణ్. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. గేమ్ ఛేంజర్ రిజల్ట్ తో రామ్ చరణ్ కూడా బాగా డిజప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను పక్కన పెడితే ఇప్పుడు పెద్ది అనే మరో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. శ్రీలంకలో ఈ మధ్యే సాంగ్ షూట్ కూడా చేశారు. రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది సినిమాను రిలీజ్ చేయనున్నట్లు త తెలుస్తోంది. అయితే శనివారం (నవంబర్ 01) పెద్ది సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. సినిమా లో హీరోయిన్ జాన్వీ కపూర్ పోస్టర్స్ రెండు రిలీజ్ చేశారు. ఈ మూవీలో జాన్వీ.. అచ్చియమ్మ అనే పాత్రలో కనిపించనుందని ప్రకటించారు. ప్రస్తుతం ఈ కొత్త పోస్టర్ మెగాభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే పెద్ది సినిమా పోస్టర్ లో ఒక చిన్న మార్పు జరిగింది. అయితే కొద్ది మంది మాత్రమే దీనిని గమనించారు.
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు రామ్ చరణ్. అనతి కాలంలోనే ‘మెగా పవర్ స్టార్’ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు చెర్రీ. మొన్నటివరకు రామ్ చరణ్ పేరుకు ముందు ఈ ట్యాగే వినిపించేది.. కనిపించేది. అయితే పెద్ది పోస్టర్ లో మాత్రం గ్లోబల్ స్టార్ మిస్ అయ్యింది. దీనికి బదులు మళ్లీ పాత ట్యాగ్ ‘మెగా పవర్ స్టార్’ అని కనిపించింది. గేమ్ ఛేంజర్ రిజల్ట్ కారణంగానే రామ్ చరణ్ ఇలా మనసు మార్చుకున్నాడని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు.
గ్లోబల్ స్టార్ స్థానంలో మెగా పవర్ స్టార్..
Meet #JanhviKapoor as #Achiyyamma from #Peddi ❤🔥@PeddiMovieOffl @vriddhicinemas @SukumarWritings @MythriOfficial pic.twitter.com/200rKYCAh2
— Ram Charan (@AlwaysRamCharan) November 1, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








