AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: అప్పుడు యాక్టింగే రాదన్నారు.. ఇప్పుడు గ్లోబల్‌స్టార్‌గా నీరాజనం.. ‘దటీజ్‌ రామ్‌చరణ్‌’ అంటోన్న ఫ్యాన్స్

జంజీర్‌ (తెలుగులో తుపాన్‌) సినిమాతో బాలీవుడ్‌లో తన అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాడు. ఇందులో చెర్రీ ఏసీపీ విజయ్‌ ఖన్నాగా నటించగా గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా అతనితో జోడి కట్టింది. శ్రీహరి ప్రత్యేక పాత్రలో నటించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం పూర్తిగా నిరాశపర్చింది.

Ram Charan: అప్పుడు యాక్టింగే రాదన్నారు.. ఇప్పుడు గ్లోబల్‌స్టార్‌గా నీరాజనం.. 'దటీజ్‌ రామ్‌చరణ్‌' అంటోన్న ఫ్యాన్స్
Ram Charan, Priyanka Chopra
Basha Shek
|

Updated on: Mar 11, 2023 | 5:43 PM

Share

మెగాస్టార్‌ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమాతో టాలీవుడ్‌ అరంగేట్రం చేశాడు రామ్‌చరణ్‌. ఆతర్వాత మగధీరతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు. రచ్చ, నాయక్‌ సినిమాలతో మాస్‌ ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. ఇదే క్రమంలో జంజీర్‌ (తెలుగులో తుపాన్‌) సినిమాతో బాలీవుడ్‌లో తన అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాడు. ఇందులో చెర్రీ ఏసీపీ విజయ్‌ ఖన్నాగా నటించగా గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా అతనితో జోడి కట్టింది. శ్రీహరి ప్రత్యేక పాత్రలో నటించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం పూర్తిగా నిరాశపర్చింది. దీనికి తోడు రామ్‌చరణ్‌ నటనపై హిందీ మీడియాలో బోలెడు విమర్శలు వచ్చాయి. ‘అసలు ఇది సినిమానేనా? రామ్‌చరణ్‌కు నటన వచ్చా? అతని ముఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌ కనిపించడం లేదు’ అంటూ క్రిటిక్స్‌ చెర్రీని విమర్శించారు. దీంతో జంజీర్‌ తర్వాత చరణ్‌ హిందీలో మరే సినిమా చేయలేదు. కట్‌ చేస్తే.. పదేళ్ల తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకులకు తన నట విశ్వరూపం చూపించాడు మెగా పవర్‌స్టార్‌. ఇందులో అతను పోషించిన సీతారామరాజు పాత్రకు బాలీవుడ్‌ ఏంటి? హాలీవుడ్ సైతం ఫిదా అయిపోయింది. ఇటీవలే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని తన నటనకు హాలీవుడ్‌ క్రిటిక్స్ అసోసియేషన్‌ అవార్డు అందుకున్నాడు చెర్రీ. ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డుల వేడుకల కోసం లాస్‌ ఏంజెలిస్‌లో ఉంటున్నాడీ మెగా హీరో.

కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ పురస్కారాల ప్రకటనకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ ప్రమోషన్లలో భాగంగా ప్రీ ఆస్కార్‌ పార్టీలో సందడి చేశాడు రామ్‌చరణ్‌. ఈ పార్టీకి గ్లోబల్‌ స్టార్ ప్రియాంక చోప్రా హోస్ట్‌గా వ్యవహరించింది. ఈ సందర్భంగా చెర్రీ-ఉపాసన దంపతులు ప్రియాంకతో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా సుమారు పదేళ్ల క్రితం ఇదే ప్రియాంకతో నటించినప్పుడు తీవ్ర నెగెటివిటీని ఎదుర్కొన్నాడు రామ్‌చరణ్‌. ఇప్పుడు మరోసారి ఆమెతోనే ఫొటోలు దిగాడు. అది కూడా ఆస్కార్‌ గడ్డపై. దీంతో మెగా ఫ్యాన్స్ ‘దటీజ్‌ రామ్‌చరణ్‌’ అంటూ చెర్రీ- ప్రియాంక ఫొటోలను నెట్టింట షేర్‌ చేస్తూ తెగ హంగామా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..