AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Game Changer: తనయుడి మూవీకి దారిచ్చిన తండ్రి.. విశ్వంభర వెనక్కి .. సంక్రాంతి బరిలో రామ్ చరణ్ గేమ్ చెంజర్..

రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కి దారి ఇస్తూ.. సంక్రాంతి బరిలో ఉన్న మెగా స్టార్ చిరంజీవి విశ్వంభర మూవీని వాయిదా వేసుకునేందుకు సహకరించిన చిరంజీవికి ,  యూవీ క్రియేషన్స్ కి దిల్ రాజు కృతజ్ఞతలు చెప్పారు. సంక్రాంతి బరిలో ఉన్న చిరంజీవి విశ్వంభర వాయిదా వేసుకుని రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ రిలీజ్ కు మార్గం సుగమం చేసింది.

Game Changer: తనయుడి మూవీకి దారిచ్చిన తండ్రి.. విశ్వంభర వెనక్కి .. సంక్రాంతి బరిలో రామ్ చరణ్ గేమ్ చెంజర్..
Game Changer Release Date
Surya Kala
|

Updated on: Oct 12, 2024 | 10:21 AM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా వెండి తెరపై సందడి చేయడానికి రెడీ అవుతోంది.  ఈ విషయాన్నీ గేమ్ చేంజర్ మూవీ నిర్మాత దిల్ రాజు అధికారంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమాను క్రిస్మస్ కు రిలీజ్ చేయాలనీ ముందు భావించారు. అయితే భారీ బడ్జెట్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కిస్మస్ కంటే సంక్రాతి అయితే బాగుంటుందని  ఓవర్ సీస్ లోని డిస్ట్రిబ్యూట‌ర్స్ తో పాటు  హాలీవుడ్,  బాలీవుడ్‌, కోలీవుడ్, క‌ర్ణాట‌క‌ సహా ఇతర డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రూ భావించారని.. ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా టీమ్ తో సంప్రదించగా .. చిత్ర బృందం విశ్వంభర సినిమా రిలీజ్ వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. దీంతో రామ్ చరణ్ గేమ్ చేంజర్ క్రిస్మస్‌ నుంచి సంక్రాంతి రేసులోకి వచ్చింది. గేమ్ చేంజర్ జనవరి 10న ఫిక్స్ అయింది.

రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కి దారి ఇస్తూ.. సంక్రాంతి బరిలో ఉన్న మెగా స్టార్ చిరంజీవి విశ్వంభర మూవీని వాయిదా వేసుకునేందుకు సహకరించిన చిరంజీవికి ,  యూవీ క్రియేషన్స్ కి దిల్ రాజు కృతజ్ఞతలు చెప్పారు.

సంక్రాంతి బరిలో ఉన్న చిరంజీవి విశ్వంభర వాయిదా వేసుకుని రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ రిలీజ్ కు మార్గం సుగమం చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో విడుదల అవుతోంది గేమ్ ఛేంజర్. మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .