Dussehra 2024: ఏడాదిలో ఒక్క దసరా రోజునే తెరచుకుని ఆలయం.. రావణుడి దర్శనం కోసం పోటెత్తే భక్తులు.. ప్రత్యేక పూజలు.. 

దసరా రోజున రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఈ ముగ్గురి దిష్టిబొమ్మలను దహనం చేయడం.. అధర్మం, అహంకారం, చెడులకు ముగింపునకు చిహ్నంగా పరిగణిస్తారు. దసరా రోజున ఒక వైపు వివిధ ప్రదేశాలలో రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. మరోవైపు భారతదేశంలోని కాన్పూర్‌లో రావణుడి ఆలయంలో దసరా రోజు రావణుడిని పూజిస్తారు.  ఈ రోజు ఆలయం గురించి తెలుసుకుందాం.. 

Dussehra 2024: ఏడాదిలో ఒక్క దసరా రోజునే తెరచుకుని ఆలయం.. రావణుడి దర్శనం కోసం పోటెత్తే భక్తులు.. ప్రత్యేక పూజలు.. 
Ravana Temple In Kanpur
Follow us
Surya Kala

|

Updated on: Oct 12, 2024 | 8:55 AM

ప్రతి సంవత్సరం దసరా పండుగను ఆశ్వయుజమాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఆశ్వయుజమాసం శుక్ల పక్షం పదవ రోజున శ్రీరాముడు రావణుని  సంహరించి సీతదేవిని రావణుడి చెర నుండి విడిపించాడని నమ్ముతారు. అందుకే దసరా రోజున రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఈ ముగ్గురి దిష్టిబొమ్మలను దహనం చేయడం.. అధర్మం, అహంకారం, చెడులకు ముగింపునకు చిహ్నంగా పరిగణిస్తారు. దసరా రోజున ఒక వైపు వివిధ ప్రదేశాలలో రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. మరోవైపు భారతదేశంలోని కాన్పూర్‌లో రావణుడి ఆలయంలో దసరా రోజు రావణుడిని పూజిస్తారు.  ఈ రోజు ఆలయం గురించి తెలుసుకుందాం..

కాన్పూర్‌లోని రావణుడి ఆలయం

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో రావణుడి ప్రత్యేక దేవాలయం ఉంది. ఈ ఆలయం కాన్పూర్‌లోని ఖాస్ బజార్, శివాల, పట్కాపూర్‌లో ఉంది. ఈ ఆలయాన్ని మహారాజ్ గురు ప్రసాద్ 1868లో నిర్మించారని చెబుతారు. దసరా రోజున దేశవ్యాప్తంగా రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయగా.. ఈ ఆలయంలో మాత్రం దసరా రోజున తెల్లవారుజాము నుంచే రావణుడు పూజలను అందుకుంటాడు .

ఏడాదికి ఒకసారి తెరచి ఆలయం

ఈ విశిష్టమైన రావణుడి ఆలయం సంవత్సరానికి ఒకసారి మాత్రమే దసరా రోజున తెరుచుకుంటుంది. రావణుడిని పూజించడం వెనుక కారణం ఏమిటంటే.. రావణుడు గొప్ప పండితుడని . . దైవిక శక్తులను కలిగి ఉన్నాడని స్థానికులు నమ్ముతారు. ఈ గుణాల వల్లే ఆయన పూజింపబడతాడు. ఇక్కడ రావణుడిని జ్ఞానం, శక్తికి చిహ్నంగా పూజిస్తారు. రావణుడు గొప్ప శివ భక్తుడు ,  నవ వ్యాకరణ పండితుడు, జ్ఞానవంతుడు. అందుకనే రావణుడు వద్దకు చివరి రోజుల్లో శ్రీరాముడు తన సోదరుడైన లక్ష్మణుడిని పంపించాడు .

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి