Tirumala: నేటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు .. శాస్రోక్తంగా సాగుతున్న చక్రస్నానం.. రాత్రి ధ్వజావరోహణం

శ్రీవారి పుష్కరిణిలో చక్రతాళ్వార్ కు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ చక్రస్నానంలో  టిటిడి ఈఓ, అడిషనల్ ఈఓ, విఐపిలు, భక్తులు పాల్గొన్నారు. తెల్లవారు జామున 3 గంటల నుంచి 6 గంటల వరకు మాడవీధుల్లో వేడుకగా స్వామివారి పల్లకి ఉత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. బ్రహ్మోత్సావాలు చివరి ఘట్టంలోకి చేరుకున్న నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం టీటీడీ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

Tirumala: నేటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు .. శాస్రోక్తంగా సాగుతున్న చక్రస్నానం.. రాత్రి ధ్వజావరోహణం
Chakrasnanam In Tirumala
Follow us
Surya Kala

|

Updated on: Oct 12, 2024 | 8:23 AM

అంగరంగ వైభవంగా సాగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి . బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. స్వామిపుష్క‌రిణిలో స్న‌ప‌న తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తున్నారు. శ్రీవారి పుష్కరిణిలో చక్రతాళ్వార్ కు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ చక్రస్నానంలో  టిటిడి ఈఓ, అడిషనల్ ఈఓ, విఐపిలు, భక్తులు పాల్గొన్నారు. ఈ చక్రస్నానం జరిగిన రోజున పుష్కరణిలో భక్తులు స్నానాలు చేస్తే సకలమైన పాపాలు తొలగి పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి. తెల్లవారు జామున 3 గంటల నుంచి 6 గంటల వరకు మాడవీధుల్లో వేడుకగా స్వామివారి పల్లకి ఉత్సవాన్ని అర్చకులు నిర్వహించారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పెద్దశేష వాహన సేవతో ప్రారంభమై ఎనిమిది రోజుల పాటు ఉదయం, రాత్రి వేళల్లో రోజుకో వాహనంపై స్వామివారి తన దేవేరులతో కలిసి ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. శుక్రవారం రాత్రి అశ్వవాహనంతో వాహన సేవలు ముగిశాయి.

ఇవి కూడా చదవండి

బ్రహ్మోత్సావాలు చివరి ఘట్టంలోకి చేరుకున్న నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం టీటీడీ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. స్వామివారి పుష్కరిణి దగ్గర 600మందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక రాత్రి రాత్రి ఏడు గంటలకు ఉభయదేవేరుల సమేతుడైన మలయప్ప స్వామి బంగారు తిరుచ్చిపై నాలుగు మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి ధ్వజావ‌రోహ‌ణం జ‌రుగ‌నుంది.  నివేదనతో పాటు వివిధ వైదిక కార్యక్రమాల అనంతరం బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా ధ్వజస్థంభంపై ఎగురవేసిన ధ్వజపటాన్ని కిందకు దించే ధ్వజావరోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలుముగియనున్నాయి .

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .