Dussehra 2024: దసరా రోజున ఈ 6 చర్యలు చేయండి.. చేపట్టిన ప్రతి పని సక్సెస్ అవుతుంది..
పురాణగ్రంధాల ప్రకారం శ్రీరాముడు లంకా రాజు దశకంఠుడు రావణుడిని సంహరించాడు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం దసరా జరుపుకుంటారు. దసరా రోజు దానం చేసే సంప్రదాయం కూడా ఉంది. దసరా రోజున స్నానం, ధ్యానం చేసిన తరువాత శ్రీరాముడిని శాస్త్రోక్తంగా పూజిస్తారు. పేదలకు ఆపన్నులకు విరాళాలు అందిస్తారు. పంచాంగం ప్రకారం ఆశ్వయుజమాసంలోని శుక్ల పక్ష దశమి తిథి అక్టోబర్ 12న ఉదయం 10:59 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే అక్టోబర్ 13 ఉదయం 09:08 గంటలకు ముగుస్తుంది. ఈ విధంగా అక్టోబర్ 12న దసరా జరుపుకోనున్నారు.
హిందూ మతంలో దసరా పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసం శుక్ల పక్షం దశమి రోజున ఎంతో వైభవంగా జరుపుకుంటారు. దీనిని విజయదశమి అని కూడా అంటారు. ఈ రోజు మర్యాద పురుషోత్తముడు శ్రీరామునికి అంకితం చేయబడింది. ఈ శుభ సందర్భంగా శ్రీరాముడిని , దుర్గాదేవిని పూజిస్తారు. రావణ దహనం కూడా జరుపుతారు. పురాణగ్రంధాల ప్రకారం శ్రీరాముడు లంకా రాజు దశకంఠుడు రావణుడిని సంహరించాడు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం దసరా జరుపుకుంటారు. దసరా రోజు దానం చేసే సంప్రదాయం కూడా ఉంది. దసరా రోజున స్నానం, ధ్యానం చేసిన తరువాత శ్రీరాముడిని శాస్త్రోక్తంగా పూజిస్తారు. పేదలకు ఆపన్నులకు విరాళాలు అందిస్తారు.
పంచాంగం ప్రకారం ఆశ్వయుజమాసంలోని శుక్ల పక్ష దశమి తిథి అక్టోబర్ 12న ఉదయం 10:59 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే అక్టోబర్ 13 ఉదయం 09:08 గంటలకు ముగుస్తుంది. ఈ విధంగా అక్టోబర్ 12న దసరా జరుపుకోనున్నారు.
దసరా రోజున ఈ 6 చర్యలు చేయండి
వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి దసరా రోజున సుందరకాండ పారాయణం చేయండి. అంతేకాదు చేతిలో కొబ్బరికాయను ఉంచుకుని హనుమాన్ చాలీసాలోని నాసై రోగ్ హరే సబ్ పీడా..జపత్ నిరంతర్ హనుమంత్ బీరా అనే ద్విపదను చదివి రోగి తలపై ఏడుసార్లు తిప్పండి. దీని తరువాత కొబ్బరికాయను రావణ దహనంలో వేయండి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల వ్యాధులు దూరమవుతాయి.
వ్యాపారంలో పురోగతిని పొందడానికి దసరా రోజున ఒక బ్రాహ్మణుడికి కొబ్బరికాయ, మిఠాయిలు, పసుపు వస్త్రాలలో పవిత్ర దారాన్ని దానం చేయండి. ఇలా చేయడం వలన వ్యాపారానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. వ్యాపారంలో పురోగతికి మార్గం తెరవబడుతుంది.
జాతకంలో శనీశ్వరుడు ఏలి నాటి శని నుంచి ఉపశమనం పొందడానికి దసరా రోజున జమ్మి చెట్టు క్రింద 11 దీపాలను నువ్వుల నూనె వేసి వెలిగించి, ప్రార్థన చేయండి. ఇది శని దోషం, లి నాటి శని ప్రభావాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
హిందూ ధర్మంలో దానానికి విశిష్ట స్థానం ఉంది . కనుక దసరా రోజున ఒక బ్రాహ్మణుడికి లేదా నిస్సహాయ వ్యక్తికి ఆహారం, బట్టలు లేదా విలువైన వస్తువులను దానం చేయండి. దీంతో పేదరికం అంతమవుతుంది. అంతేకాదు ఇంట్లో ఇబ్బందులు ఉంటే తొలగి పోతాయి.
దసరా రోజున రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం కూడా ఆనవాయితీ. ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. మీరున్న ప్రదేశంలో రావణ దహనం నిర్వహిస్తున్నట్లయితే అందులో పాల్గొనండి. ఈ చర్య ద్వారా జీవితంలో చెడుని తొలగిస్తుంది.
ఆర్థికంగా నష్టపోతుంటే దసరా రోజున ఆలయంలో చీపురు దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. సాయంత్రం ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం చేసే సమయంలో ఖచ్చితంగా లక్ష్మీ దేవిని ధ్యానం చేయండి.
దసరా ప్రాముఖ్యత
దసరా రోజున రాముడు, తల్లి దుర్గ దేవిని పూజిస్తారు. అయితే కొంత మంది కుబేరుడు, లక్ష్మీ దేవిని కూడా కలిపి పూజించవచ్చు. కుబేరుడు, లక్ష్మీ దేవిని పూజించడం ద్వారా మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల జీవితంలో శ్రేయస్సు, సంతోషం వస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి