AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: ‘వరద బాధితులకు అండగా ఉందాం’.. తెలుగు రాష్ట్రాలకు రామ్ చరణ్ కోటి రూపాయల విరాళం

వరద బీభత్సంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఊహించ‌ని విధంగా ప్రాణ నష్టం, ఆస్తిన‌ష్టం జ‌రిగింది. వీరిని ఆదుకోవ‌టానికి రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి వారికి త‌మ వంతు సాయంగా నిల‌వ‌టానికి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ముందుకు వ‌చ్చింది.

Ram Charan: 'వరద బాధితులకు అండగా ఉందాం'.. తెలుగు రాష్ట్రాలకు రామ్ చరణ్ కోటి రూపాయల విరాళం
Ram Charan
Basha Shek
|

Updated on: Sep 04, 2024 | 5:04 PM

Share

వరద బీభత్సంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఊహించ‌ని విధంగా ప్రాణ నష్టం, ఆస్తిన‌ష్టం జ‌రిగింది. వీరిని ఆదుకోవ‌టానికి రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి వారికి త‌మ వంతు సాయంగా నిల‌వ‌టానికి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో హీరో రామ్ చ‌ర‌ణ్ సైతం త‌న‌వంతుగా కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఇందులో ఆయ‌న ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి రూ.50 ల‌క్ష‌లు, తెలంగాణ ప్ర‌భుత్వానికి రూ.50 ల‌క్ష‌లు విరాళంగా ఇస్తున్న‌ట్లు తెలిపారు. ‘వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయల విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు రామ్ చరణ్. తండ్రి చిరంజీవి సేవా బాట‌లో ప్ర‌యాణిస్తూ ఆయ‌న‌లాగానే రామ్ చ‌ర‌ణ్ తెలుగు వారి కోసం కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించటంపై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

రామ్ చరణ్ ట్వీట్..

వీరితో పాటు అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్ విశ్వక్ సేన్, సిద్దూ జొన్నల గడ్డ, నాగార్జున, అనన్య నాగళ్ల తదితరులు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తమవంతుగా ముఖ్యమంత్రుల వరద సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు.

మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల విరాళం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ
టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ
ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
నానమ్మ నేర్పిన ధైర్యం.. చీకటి వెనుక నిజంః రాహుల్
నానమ్మ నేర్పిన ధైర్యం.. చీకటి వెనుక నిజంః రాహుల్
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. తర్వాత
ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. తర్వాత
ఈ సింపుల్ టిప్స్ మీకు తెలిస్తే సమ్మర్‌లోనూ ఇంటిని కూల్‌గా ఉంచోచ్చ
ఈ సింపుల్ టిప్స్ మీకు తెలిస్తే సమ్మర్‌లోనూ ఇంటిని కూల్‌గా ఉంచోచ్చ
జర భద్రం! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 7 ఆహార పదార్థాలు ఇవే..
జర భద్రం! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 7 ఆహార పదార్థాలు ఇవే..
ఇవాళే OTTకి వచ్చిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. IMDBలో 9.6 రేటింగ్
ఇవాళే OTTకి వచ్చిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. IMDBలో 9.6 రేటింగ్
రాహుల్ వ్యాఖ్యలతో లోక్‌సభలో గందరగోళం
రాహుల్ వ్యాఖ్యలతో లోక్‌సభలో గందరగోళం