AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: మహాలక్ష్మి పుట్టిన వేళా విశేషం.. క్లింకార అడుగుపెట్టాక మెగా ఫ్యామిలీ ఇంట అన్నీ శుభ శకునాలే

ఆడపిల్ల పుట్టినప్పుడు కూడా తమ కుటుంబంలోని కష్టాలన్నీ తొలగిపోయాయని, అన్నీ శుభ శకునాలే జరుగుతున్నాయని చాలామంది అంటుంటారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలోనూ ఇదే జరిగిందంటున్నారు అభిమానులు. మెగా మనవరాలు క్లింకార కొణిదెల, మెగా ఫ్యామిలీకి లక్కీ లక్ష్మిగా మారిందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులకు గతేడాది జూన్ 20న క్లింకార కొణిదెల జన్మించింది.

Pawan Kalyan: మహాలక్ష్మి పుట్టిన వేళా విశేషం.. క్లింకార అడుగుపెట్టాక మెగా ఫ్యామిలీ ఇంట అన్నీ శుభ శకునాలే
Mega Family
Basha Shek
|

Updated on: Jun 07, 2024 | 10:23 AM

Share

సాధారణంగా ఒక కొత్త వ్యక్తి ఇంట్లోకి అడుగు పెడితే శుభ శకునాల గురించి చాలా మంది మాట్లాడుకుంటుంటారు. ముఖ్యంగా కొత్త కోడలు అడుగు పెట్టినప్పుడు ఇలాంటి మాటలు తరచుగా వినిపిస్తుంటాయి. అలాగే ఆడపిల్ల పుట్టినప్పుడు కూడా తమ కుటుంబంలోని కష్టాలన్నీ తొలగిపోయాయని, అన్నీ శుభ శకునాలే జరుగుతున్నాయని చాలామంది అంటుంటారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలోనూ ఇదే జరిగిందంటున్నారు అభిమానులు. మెగా మనవరాలు క్లింకార కొణిదెల, మెగా ఫ్యామిలీకి లక్కీ లక్ష్మిగా మారిందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులకు గతేడాది జూన్ 20న క్లింకార కొణిదెల జన్మించింది. క్లింకార ఈ భూమ్మీదకు రావడానికి కొన్ని రోజుల ముందే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డు లభించింది. క్లింకార పుట్టిన తర్వాత బాబాయ్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం 2023, నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా జరిగింది.

ఇక మనవరాలు క్లింకార ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాతే చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. సినిమా పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును మెగా స్టార్ కు ప్రదానం చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ ఘనవిజయం సాధించింది. దీంతో క్లింకార సెంటిమెంట్‌కి మరింత బలం చేకూరింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లోనూ విజయ ఢంకా మోగించింది జనసేన. . ఇవన్నీ కూడా క్లింకార పుట్టిన తర్వాతే జరగడంతో మెగా ప్రిన్సెస్, మెగా ఫ్యామిలీకి లక్కీ లక్ష్మిగా మారిందని మెగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కాగా క్లింకార కొణిదెలను మీడియాకి, సోషల్ మీడియా కు దూరంగా పెంచాలని అనుకుంటున్నారు రామ్ చరణ్, ఉపాసన. అందుకే ఇప్పటిదాకా పాపకు సంబంధించిన ఏ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు..

ఇవి కూడా చదవండి

చిరంజీవి ఇంట్లో పవన్ కల్యాణ్..

ప్రధాని మోడీతో పవన్ కల్యాణ్ ఫ్యామిలీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.