- Telugu News Photo Gallery Cinema photos Will pawan kalyan settled in politics after completing hari hara veeramallu and og movies
Pawan Kalyan: ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న పవన్ కళ్యాణ్ నిర్ణయం
ఎన్నికలు అయిపోయాయి.. ఫలితాలు వచ్చేసాయి.. పవన్ కళ్యాణ్ ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని అందించారు జనం. మరి ఇప్పుడు ఈయన స్టెప్ ఏంటి..? ఆలోచనలు ఎటువైపు..? గతంలోలా ఇకపై కూడా సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తారా..? లేదంటే సినిమాలకు గుడ్ బై చెప్పి.. రాజకీయాల్లోనే కొనసాగుతారా..? పవన్ కళ్యాణ్ ప్లానింగ్‌పై ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం గాల్లో తేలిపోతున్నారు. పదేళ్ళ అలుపెరుగని పోరాటం తర్వాత ఆయన ఎమ్మెల్యే అవ్వడం..
Updated on: Jun 07, 2024 | 10:53 AM

ఎన్నికలు అయిపోయాయి.. ఫలితాలు వచ్చేసాయి.. పవన్ కళ్యాణ్ ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని అందించారు జనం. మరి ఇప్పుడు ఈయన స్టెప్ ఏంటి..? ఆలోచనలు ఎటువైపు..? గతంలోలా ఇకపై కూడా సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తారా..? లేదంటే సినిమాలకు గుడ్ బై చెప్పి.. రాజకీయాల్లోనే కొనసాగుతారా..? పవన్ కళ్యాణ్ ప్లానింగ్‌పై ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం గాల్లో తేలిపోతున్నారు. పదేళ్ళ అలుపెరుగని పోరాటం తర్వాత ఆయన ఎమ్మెల్యే అవ్వడం.. పార్టీ కూడా ఘన విజయం సాధించడంతో పీకే ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. అయితే ఈ విజయంతో వాళ్లకు కొత్త అనుమానాలు కూడా వస్తున్నాయి. రాజకీయం సరే.. మరి సినిమాల సంగతేంటి అనేది ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయింది.

మొన్నటి వరకు ఆయనకి ఏ పదవి లేదు.. కావాలనుకున్నపుడు సినిమాలు చేసి.. అవసరం అయినపుడు జనం మధ్యలోకి వెళ్లారు పవన్. కానీ ఇప్పుడలా కుదురుతుందా అనేది అనుమానమే. ఎందుకంటే ఎమ్మెల్యేగానే కాదు.. ఓ పార్టీ అధ్యక్షుడిగా చాలా బిజీగా ఉండబోతుంది పవన్ షెడ్యూల్. అందుకే సినిమాలపై జనసేనాని నిర్ణయం కూడా కఠినంగానే ఉండబోతుందని తెలుస్తుంది.

ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసాక.. పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయిపోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే జూన్ మూడో వారం నుంచి హరిహర వీరమల్లు 1 షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఇది పూర్తయ్యాక.. ఓజిని కూడా సెప్టెంబర్‌లోపే పూర్తి చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సెట్స్‌పైకి రానుంది.

వీటిలో హరిహర వీరమల్లు, ఓజి రెండు పార్ట్స్ ఉంటాయి. ఉస్తాద్ భగత్ సింగ్ 2025 ఫస్టాఫ్‌లో సెట్స్‌పైకి రానుంది. ఇన్నాళ్లూ తనకోసం ఓపిగ్గా వేచి చూసిన దర్శక నిర్మాతలకి బల్క్ డేట్స్ ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్. 2025 సమ్మర్‌లోపే పూర్తి చేసి.. ఆ తర్వాత పూర్తిగా పాలిటిక్స్‌కే సమయం కేటాయించబోతున్నారు జనసేనాని.




