Kalki 2898 AD: కల్కి టైమ్ స్టార్ట్స్.. అక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్
అప్‌డేట్స్ ఇవ్వడం మొదలైన తర్వాత.. బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతున్నారు కల్కి టీం. రోజుకో కొత్త అప్‌డేట్ ఇస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా మరో సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చింది. జూన్ 10న ట్రైలర్ రిలీజ్ అనుకునేరు.. అది కాదు దాన్ని మించిన అప్‌డేట్ వినిపిస్తుందిప్పుడు. మరి అదేంటో చూద్దామా..? కల్కి రిలీజ్‌కు ఉన్నది ఇంకా మూడు వారాలే.. అందుకే ప్రమోషన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. ఇప్పటికే టీజర్‌తో పాటు మూడు నాలుగు మేకింగ్ వీడియోలు విడుదల చేసారు దర్శక నిర్మాతలు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Jun 07, 2024 | 11:01 AM

అప్‌డేట్స్ ఇవ్వడం మొదలైన తర్వాత.. బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతున్నారు కల్కి టీం. రోజుకో కొత్త అప్‌డేట్ ఇస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా మరో సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చింది. జూన్ 10న ట్రైలర్ రిలీజ్ అనుకునేరు.. అది కాదు దాన్ని మించిన అప్‌డేట్ వినిపిస్తుందిప్పుడు. మరి అదేంటో చూద్దామా..?

కల్కి రిలీజ్‌కు ఉన్నది ఇంకా మూడు వారాలే.. అందుకే ప్రమోషన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. ఇప్పటికే టీజర్‌తో పాటు మూడు నాలుగు మేకింగ్ వీడియోలు విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

వాటిని చూస్తుంటేనే కల్కి రేంజ్ ఏంటనేది అర్థమవుతుంది. తాజాగా జూన్ 10న కల్కి ట్రైలర్ విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఆంధప్రదేశ్‌లో జూన్ 9న కొత్త ప్రభుత్వం ఏర్పడేలా కనిపిస్తుంది. అందుకే ఆ మరుసటి రోజు కల్కి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ చేస్తున్నారు.

దీని తర్వాత మేజర్ ఈవెంట్ మరోటి ప్లాన్ చేస్తున్నారు కల్కి టీం. అది కూడా ఎక్కడో కాదు.. అమరావతిలో. జూన్ 22, 23లో ఏదో ఒకరోజు అక్కడే ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల వరకు ఓకే కానీ పాన్ ఇండియన్ సినిమా కాబట్టి ముంబైలోనూ ఓ ఈవెంట్ చేయాలని చూస్తున్నారు కల్కి టీం.

తెలుగులోనే కాదు.. బాలీవుడ్‌లోనూ కొన్ని నెలలుగా సరైన విజయం రాలేదు. ఇప్పుడా లోటు కల్కి తీరుస్తుందని నమ్ముతున్నారు నార్త్ డిస్ట్రిబ్యూటర్లు. జూన్ 27 నాటికీ రాజకీయ వాతావరణం సాధారణ స్థితికి వచ్చేస్తుంది కాబట్టి థియేటర్స్‌కు ఆడియన్స్ రావడం ఖాయం.





























