- Telugu News Photo Gallery Cinema photos Anasuya interesting comments on Chiranjeevi and Pawan Kalyan bonding
Anasuya Bharadwaj: మెగా అనుబంధం గురించి అనసూయ జబర్దస్త్ స్టేట్మెంట్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయం పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘనవిజయం సాధించారు. పవన్ ఎన్నికల్లో గెలవడంతో అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
Updated on: Jun 07, 2024 | 12:10 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయం పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘనవిజయం సాధించారు. పవన్ ఎన్నికల్లో గెలవడంతో అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

అలాగే సినీ సెలబ్రిటీలు, రాజకీయనాయకులు పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలందరూ పవన్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.

మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ను అభినందించారు. అలాగే అల్లు అర్జున్, ఎన్టీఆర్, రజినీకాంత్, దళపతి విజయ్ కూడా పవన్ కళ్యాణ్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేశారు. తాజాగా అనసూయ కూడా పవన్ ను అభినందించింది.

ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని బీజేపీ పెద్దలను కలిసిన పవన్.. ఆ తర్వాత తన ఫ్యామిలీతో కలిసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. చిరంజీవి కాళ్ళ పై పడి పవన్ ఆశీర్వాదం తీసుకున్నారు. దీని పై అనసూయ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

అనసూయ మెగా ఫ్యామిలీ అనుబంధాలపై రియాక్ట్ అవుతూ..ఇది నిజమైన ప్రేమ అని పేర్కొంది. అలాగే పవన్ పై ప్రశంసలు కురిపించింది. అలాగే నాయకుడు వచ్చాడు అని పేర్కొంది అనసూయ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.




