- Telugu News Photo Gallery Cinema photos Pooja Hegde looking for movie chances and Rashmika Mandanna going on vacation trips
Pooja VS Rashmika: ఒకరు ఛాన్సుల కోసం పరుగులు.. ఒకరేమో ఎంజయ్ చేస్తూ ట్రిప్పులు..
ఏ ఇండస్ట్రీలో అయినా సక్సెస్, ఫెయిల్యూర్స్ అన్నీ పియర్ గ్రూప్స్ తోనే కంపేర్ అవుతుంటాయి. అలాంటి పోలిక పూజా హెగ్డే, అండ్ రష్మిక మధ్య ఎప్పుడూ ఉంటుంది. లేటెస్ట్ గా మరోసారి వీరిద్దరి పేర్లు కలిసి ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ పూజా హెగ్డే ఏం చేయబోతున్నారు? రష్మిక ఎటు వెళ్లనున్నారు? చూసేద్దాం రండి... ఎప్పుడు? ఇంకెప్పుడు? ఇంకా ఎప్పుడు? అంటూ ఓ మంచి అవకాశం కోసం ఇన్నాళ్లూ ఈగర్‌గా వెయిట్ చేశారు పూజాహెగ్డే.
Updated on: Jun 07, 2024 | 12:21 PM

ఏ ఇండస్ట్రీలో అయినా సక్సెస్, ఫెయిల్యూర్స్ అన్నీ పియర్ గ్రూప్స్ తోనే కంపేర్ అవుతుంటాయి. అలాంటి పోలిక పూజా హెగ్డే, అండ్ రష్మిక మధ్య ఎప్పుడూ ఉంటుంది. లేటెస్ట్ గా మరోసారి వీరిద్దరి పేర్లు కలిసి ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ పూజా హెగ్డే ఏం చేయబోతున్నారు? రష్మిక ఎటు వెళ్లనున్నారు? చూసేద్దాం రండి...

ఎప్పుడు? ఇంకెప్పుడు? ఇంకా ఎప్పుడు? అంటూ ఓ మంచి అవకాశం కోసం ఇన్నాళ్లూ ఈగర్‌గా వెయిట్ చేశారు పూజాహెగ్డే. సౌత్‌లో సూపర్‌డూపర్ సక్సెస్‌లు చూసిన ఈ బ్యూటీ,ఈ మధ్య నార్త్ ప్రాజెక్టులతో మింగిల్ అయ్యారు. అయితే అక్కడ అవి చప్పుడు చేయకపోవడంతో, సూట్‌కేస్ సర్దుకుని మళ్లీ సౌత్ వైపు ట్రావెల్ చేస్తున్నారు.

సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య44 షూటింగ్ కోసం ఇప్పుడు సౌత్‌లో ల్యాండ్ అయ్యారు పూజా హెగ్డే. ఈమె ఇటు వస్తుంటే, రష్మిక మాత్రం ట్రావెల్ బ్యాగ్‌తో నార్త్ ట్రిప్ వెళ్తున్నారు.

ఆల్రెడీ నార్త్ లో మంచి పేరు తెచ్చుకున్నారు నేషనల్ క్రష్. సుల్తాన్ సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా సికిందర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండో వారం నుంచి అక్కడ సికిందర్ షూటింగ్ మొదలవుతుంది.

అంతలోపే సౌత్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి రష్మిక. ఒకవేళ ప్యాచ్ వర్క్ లు మిగిలినా... సికిందర్ షూట్ గ్యాప్‌లో, వీటిని కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.




