Acharya: నీలాంబరిని తెగ పొగిడేస్తున్న రామ్ చరణ్.. ఆకట్టుకుంటున్న ఆచార్య మెలోడి..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా ఆచార్య. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్

Acharya: నీలాంబరిని తెగ పొగిడేస్తున్న రామ్ చరణ్.. ఆకట్టుకుంటున్న ఆచార్య మెలోడి..
Acharya
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 04, 2021 | 9:58 AM

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా ఆచార్య. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఇప్పటిక షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‏కు రెస్పాన్స్ మాములుగా రాలేదు. ముఖ్యంగా లాహే లాహే సాంగ్ సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టించింది. అంతేకాకుండా.. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి.. ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధానపాత్రలలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఆచార్య మూవీపై అంచనాలు భారీగే ఉన్నాయి. ఈ మూవీని చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆచార్య నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కోసం చిరు అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. దీపావళి కానుకగా.. ఈ మూవీ నుంచి నీలాంబరీ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది చిత్రయూనిట్. నీలాంబరీ.. నీలాంబరీ.. లేరేవ్వరే నీలామరీ.. నీలాంబరీ.. నీలాంబరీ.. నీ అందమే నీ అల్లరి అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో చెర్రీ.. పూజా హెగ్డే లుక్స్ అభిమానులు ఆకట్టుకోవడమే కాకుండా.. చరణ్ స్టెప్పులు సైతం అదుర్స్ అనిపిస్తున్నాయి. ఈ పాట పూర్తి వీడియోను రేపు (నవంబర్ 5న) ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Tamanna: మిల్కీబ్యూటీ లక్కీ ఛాన్స్.. చిరంజీవి సినిమా కోసం తమన్నాకు ఎంత రెమ్యూనరేషన్ అంటే..

Trisha: అరుదైన రికార్డు సృష్టించిన త్రిష.. ట్విట్టర్‏లలో శుభాకాంక్షల వెల్లువ.. అసలు మ్యాటరేంటంటే..

Major Movie: 26/11 అమ‌ర వీరుడు సందీప్ కృష్ణ‌న్ బ‌యోపిక్ వ‌చ్చేస్తోంది.. మేజర్ విడుద‌ల ఎప్పుడంటే..

Balakrishna: బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ ఎంటర్‏టైన్‏మెంట్ షూరు.. ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..