Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Major Movie: 26/11 అమ‌ర వీరుడు సందీప్ కృష్ణ‌న్ బ‌యోపిక్ వ‌చ్చేస్తోంది.. మేజర్ విడుద‌ల ఎప్పుడంటే..

Major Movie: దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబ‌యిపై జ‌రిగిన 26/11 దాడి యావత్ దేశాన్ని ఒక్క‌సారిగా క‌లిచి వేసిన విష‌యం తెలిసిందే. పాకిస్తాన్ నుంచి వ‌చ్చిన కొంద‌రు ఉగ్ర‌మూక‌లు విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడి చేసి...

Major Movie: 26/11 అమ‌ర వీరుడు సందీప్ కృష్ణ‌న్ బ‌యోపిక్ వ‌చ్చేస్తోంది.. మేజర్ విడుద‌ల ఎప్పుడంటే..
Major Releasing Date
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 04, 2021 | 6:42 AM

Major Movie: దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబ‌యిపై జ‌రిగిన 26/11 దాడి యావత్ దేశాన్ని ఒక్క‌సారిగా క‌లిచి వేసిన విష‌యం తెలిసిందే. పాకిస్తాన్ నుంచి వ‌చ్చిన కొంద‌రు ఉగ్ర‌మూక‌లు విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడి చేసి ప‌లువురు అమాయ‌క ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకున్న ఘ‌ట‌న‌ను దేశం ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేదు. ఈ క్ర‌మంలోనే దేశంపై జ‌రిగిన ఈ దాడిలో వీరోచితంగా పోరాడి వీర మ‌ర‌ణం పొందారు ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్‌ ఉన్నికృష్ణన్‌. ప్ర‌స్తుతం ఇయ‌న జీవిత క‌థ ఆధారంగానే మేజ‌ర్ అనే సినిమా తెర‌కెక్కుతోన్న విషయం తెలిసిందే.

అడివి శేష్ లీడ్ రోల్‌లో న‌టించిన ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్, సోనీ పిక్చర్స్ నిర్మించింది. ఇక ఈ సినిమాకు శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై భారీగానే అంచ‌నాలు ఉన్నాయ‌ని చెప్పాలి. నిజానికి ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సి ఉండ‌గా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే తాజాగా సినిమాను వేగంగా పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డ చిత్ర యూనిట్ ఆ దిశ‌గా అడుగులు వేస్తోంది.

ఇక చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌రి 11న ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సినిమాలో సందీప్ వీరోచిత పోరాటంతో పాటు ఆయ‌న జీవితంలోని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను కూడా ప్ర‌స్తావించ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Also Read: Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం యూటర్న్.. అసలు కారణం ఇదేనా?..

Accident: పండుగ పూట విషాదం.. ప‌టాకులు కొనేందుకు వెళ్లి నలుగురు దుర్మరణం..

Viral Video: ఇదేందిది.! ఈ చిన్నారి చేసిన పని చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.. మీ చిన్నతనం గుర్తొస్తుంది!

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..