RRR: దోస్తీ సాంగ్‌ను ఎంజాయ్ చేస్తున్న రామరాజు- భీమ్ .. వీడియోతో సర్‌ప్రైజ్ చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్..
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్ , తారక్ కలిసి నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులంతా..
RRR : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్ , తారక్ కలిసి నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా తారక్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పాట కోసం ఉక్రెయిన్ వెళ్ళింది చిత్రయూనిట్. ఈ పాటతో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఏ చిన్న విషయం బయటకు వచ్చిన అది క్షణాల్లో సంచలనంగా మారుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియోతో అభిమానులను సర్‌ప్రైజ్ ఇచ్చింది ఆర్ఆర్ఆర్ టీమ్. ఈ వీడియోలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లగ్జరీ కారులో ప్రయాణిస్తూ.. దోస్తీ సాంగ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇటీవలే ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ అనే సాంగ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాటను 5భాషల్లో విడుదల చేశారు. 5 బాషల సింగర్స్ ఈ పాటను అలరించారు.
ఇక ఈ పాట యూట్యూబ్ లో టాలీవుడ్‌లో లైక్స్ పరంగా కొత్త రికార్డులతో దుమ్ము దుమారం చేసింది అని చెప్పాలి. 24 గంటల్లో వ్యూస్ పరంగా కొత్త రికార్డులు ఏవి నమోదు చేయకున్నా లైక్స్ పరంగా మాత్రం కొత్త రికార్డులను నమోదు చేసింది. ఇది వరకు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలోని మగువా మగువా సాంగ్ 24 గంటల్లో 455K లైక్స్‌ని సాధించగా దోస్తీ సాంగ్ 520K లైక్స్‌తో సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు చరణ్, తారక్ ఆ పాటను ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి..
మరిన్ని ఇక్కడ చదవండి :