Rajini Kanth: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలవనున్న రజినీకాంత్.. అయోధ్యను సందర్శించనున్న తలైవా..
కొడుకు కోసం తపనపడే తండ్రి పాత్రలో రజినీ నటనతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇందులో ఆయన నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాను ఆదివారం రజినీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి చూడనున్నారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ.. 'నేను సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి జైలర్ సినిమా చూస్తాము.. దేవుడి ఆశీస్సులతో సినిమా హిట్ అయిందని అన్నారు రజినీ. ఈ స్పెషల్ షోలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా పాల్గొననున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జైలర్ హావా కొనసాగుతుంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు.. భారీగా వసూళ్లు రాబడుతుంది. కేవలం సౌత్ లోనే కాకుండా.. కాకుండా నార్త్ ఇండియాలోనూ జోరుగా సందడి చేస్తోంది. ఆగస్ట్ 10న విడుదలైన ఇప్పటికే పలు రికార్డ్స్ బ్రేక్ చేసింది. చాలా కాలం తర్వాత రజినీ భారీ విజయాన్ని అందుకున్నారు. ఇందులో తలైవా స్టైల్.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి. దీంతో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల రూపాయల వసూళ్లకు చేరువలో ఉంది. ఇటీవల హిమాలయలకు వెళ్లి తలైవా.. తన యాత్ర ముగించుకుని తిరిగి తమిళనాడుకు చేరుకున్నారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను రజిని ఆదివారం కలవున్నారు. ఈ విషయాన్ని రజనీకాంత్ స్వయంగా ధృవీకరించారు.
కొడుకు కోసం తపనపడే తండ్రి పాత్రలో రజినీ నటనతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇందులో ఆయన నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాను ఆదివారం రజినీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి చూడనున్నారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘నేను సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి జైలర్ సినిమా చూస్తాము.. దేవుడి ఆశీస్సులతో సినిమా హిట్ అయిందని అన్నారు రజినీ. ఈ స్పెషల్ షోలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా పాల్గొననున్నారు.




యూపీ పర్యటనలో రజినీకాంత్..
प्रदेश की राज्यपाल श्रीमती आनंदीबेन पटेल से आज राजभवन में प्रसिद्ध अभिनेता व निर्देशक श्री रजनीकान्त ने शिष्टाचार भेंट की। pic.twitter.com/Nr3rVHfPwZ
— Governor of Uttar Pradesh (@GovernorofUp) August 19, 2023
ఇదిలా ఉంటే.. శనివారం రాజ్‌భవన్‌లో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌తో రజనీకాంత్ భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రజనీకాంత్ ఆదివారం అయోధ్యలో పర్యటించనున్నారు. ఇప్పటికే జైలర్ సినిమాను తమిళనాడు సీఎం స్టాలిన్ వీక్షించడం జరిగింది. అలాగే కేరళ సీఎం విజయన్ పినరయ్ కూడా చూసిన సంగతి తెలిసిందే. ‘జైలర్’ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్, మలయాళ స్టార్ నటుడు మోహన్‌లాల్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.
యూపీ పర్యటనలో రజినీకాంత్..
#WATCH | Actor Rajinikanth in Lucknow on being asked about his visit to Ayodhya tomorrow; says, “Jee kal program hai.” pic.twitter.com/naUdniPd3N
— ANI (@ANI) August 19, 2023
రజినీకాంత్ ఇన్ స్టాగ్రామ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
