Shivani – Shivathmika: మరోసారి అదృష్టం పరీక్షించుకోనున్న సీనియర్ హీరో కుమార్తెలు.. కోలీవుడ్‌లోకి ఎంట్రీ..

సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. గరుడ వేగా సినిమా తో మంచి హిట్ అందుకున్న రాజశేఖర్ ఆతర్వాత కల్కీ సినిమా చేసారు.

Shivani - Shivathmika: మరోసారి అదృష్టం పరీక్షించుకోనున్న సీనియర్ హీరో కుమార్తెలు.. కోలీవుడ్‌లోకి ఎంట్రీ..
Shivani
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 23, 2021 | 8:55 AM

Shivani and Shivathmika: సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. గరుడ వేగా సినిమా తో మంచి హిట్ అందుకున్న రాజశేఖర్ ఆతర్వాత కల్కీ సినిమా చేసారు. ఇప్పుడు శేఖర్ అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.ఇదిలా ఉంటే రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  ముందుగా చెల్లెలు శివాత్మిక హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన దొరసాని సినిమాలో నటించి ఆకట్టుకుంది ఈ భామ. మొదటి సినిమాలోనే తన నటనతో కట్టిపడేసింది శివాత్మిక. అలాగే ఈ బ్యూటీ  ‘రంగమార్తాండ’లోను కనిపించనుంది.

ఆ తర్వాత శివాని హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తేజ సజ్జ హీరోగా నటించిన అద్భుతం సినిమాతో హీరోయిన్ గా మారింది ఈ బ్యూటీ. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇలా అక్క చెల్లెల్లు సూపర్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ ముద్దుగుమ్మలకు తెలుగులో ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీస్ కోలీవుడ్ లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శివాని చేసిన తమిళ్ సినిమా ‘అన్బరివు’ వచ్చేనెల 7వ తేదీ నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే  శివాత్మిక చేసిన ‘ఆనందం విలయాడుం వీడు’ సినిమా ఈ నెల 24వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇలా తెలుగుతో పాటు తమిళ్ లోను సెటిల్ అవ్వాలని చూస్తున్నారు రాజశేఖర్ ముద్దుల తనయాలు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?