Natural star Nani: నేను థియేటర్ కోసం సినిమాను దాచాల్సిన అవసరం లేదు.. నాని ఆసక్తికర కామెంట్స్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు నాని.

Natural star Nani: నేను థియేటర్ కోసం సినిమాను దాచాల్సిన అవసరం లేదు.. నాని ఆసక్తికర కామెంట్స్
Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 23, 2021 | 9:09 AM

Natural star Nani: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు నాని. దాదాపు రెండేళ్ళతర్వాత థియేటర్ లో నాని సినిమా అడుగుపెడుతుంది. దాంతో నాని అభిమానులంతా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ  సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.నాని సరసన  సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా కనిపించనున్నారు.  ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రబృందం.. ఈ నేపథ్యంలో హీరో నాని మీడియాతో మాట్లాడారు.. నేను మామూలుగానే థియేటర్‌లో సినిమా చూసేందుకు ఇష్టపడతాను. నేను సత్యం థియేటర్ గురించి ఎక్కువ మాట్లాడతానని అందరికీ తెలుసు. థియేటర్లో వెనకాల నిల్చుని సినిమాను చూస్తుంటాను అని అన్నారు.  రెండేళ్ల తరువాత ఇలా శ్యామ్ సింగ రాయ్‌తో వస్తున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది అన్నాడు నాని.

కథలో చాలా దమ్ముంటేనే పీరియడ్ సినిమాలు తీయాలి. పీరియడ్ సినిమా అన్ని రకాలుగా రిస్క్ ఉంటుంది. అలాగే శ్యామ్ సింగ రాయ్‌కి అద్భుతమైన కథ దొరికింది. కథే కాకుండా నటీనటులు దొరికారు. ఇలాంటి కథకు మంచి టెక్నీషియన్స్ కూడా ఉండాలి. అలా అంతా కలిసి వచ్చినప్పుడు తెరపై ఆ ఫీల్‌ను తీసుకుని రాగలం అన్నాడు.  ఏవో సెట్లు వేసాం కాబట్టి పీరియడ్ సినిమా చూసినట్టుగా అనిపించదు. మీరే ఆ కాలంలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది అని చెప్పుకొచ్చాడు. శ్యామ్ సింగ రాయ్ సినిమాతో ఎన్నో మెమోరీస్ ఉన్నాయి. సినిమా పట్లా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం అని ధీమా వ్యక్తం చేశాడు.

శ్యామ్ సింగ రాయ్ పోరాటం చెడు మీద. చెడు అనేది రకరకాలుగా ఉంటుంది. అందులో దేవదాసీ వ్యవస్థ కూడా ఉంటుంది. అప్పట్లో ఉండే దురాచారాలపై కమ్యూనిస్ట్ అయిన శ్యామ్ ప్రేమలో పడితే.. అతను ఎలా మారుతాడు అనేది సినిమా. శ్యామ్ సింగ రాయ్ అనేది ఎపిక్ లవ్ స్టోరీ. ఇది పూర్తిగా కల్పితం. నేను థియేటర్ కోసం సినిమాను దాచాల్సిన అవసరం లేదు. కంటిన్యూగా సినిమాలు చేయాలి. ఏ రోజైతే థియేటర్లు స్టార్ట్ అవుతాయో ఆ రోజు ఇలాంటి ఓ సినిమాను రెడీగా పెడతాను అని నాకు తెలుసు. నిర్మాతలు హ్యాపీగా ఉండాలి. సినిమా కోసం పని చేసినవారంతా సంతోషంగా ఉండాలి. రెగ్యులర్‌గా పని చేస్తుండాలి. ఆ పనిని ఆపకూడదు. అది ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉండాలి. ఓటీటీలో రిలీజ్ చేస్తే ఏమైనా అవుతుందా? అనే భయాలేవి నాకు లేవు అని చెప్పుకొచ్చాడు నాని.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Konidela Upasana: ప్రధానమంత్రితో సమావేశమైన మెగా కోడలు.. ఎందుకంటే..

RRR: జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!

Kamal Haasan: విక్రమ్‌ సెట్‌లోకి అడుగుపెట్టిన కమల్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే!