Amritha Aiyer: నాకు సెట్ అయ్యే పాత్రలు మాత్రమే చేస్తాను.. హీరోయిన్ అమృతా అయ్యర్ ఆసక్తికర కామెంట్స్..
విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీ విష్ణు. తాజాగా శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లుగా తేజ మర్ని దర్శకత్వంలో రూపొందిన చిత్రం అర్జున ఫల్గుణ.

Amritha Aiyer: విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీ విష్ణు. తాజాగా శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లుగా తేజ మర్ని దర్శకత్వంలో రూపొందిన చిత్రం అర్జున ఫల్గుణ. ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో హీరోయిన్ అమృతా అయ్యర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయలు పంచుకుంది. ముద్దుగుమ్మ అమృత మాట్లాడుతూ.. అర్జున ఫల్గుణ స్క్రిప్ట్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది అని అంది. అన్ని రకాల జానర్లు ఈ సినిమాలో ఉంటాయి. ఐదుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో నేను ఒకరిని. ఫ్రెండ్స్‌కి కష్టం వస్తే సాయం చేసేందుకు ముందుకు వస్తాను. పరిస్థితులు అనుకూలించకపోయినా ఫ్రెండ్ కోసం నిలబడటమనే పాయింట్ బాగా నచ్చింది. ఫ్రెండ్ అంటే జండర్ చూడకూడదు. అవసరంలో సాయం చేయాలన్నది బాగా నచ్చింది అని చెప్పుకొచ్చింది అమృత. ఇక అర్జున్ ఫల్గుణ సినిమా అనేది విలేజ్ డ్రామా. రాజమండ్రిలో జరిగిన యథార్ఘ ఘటన ఆధారంగా తెరకెక్కించారు.నేను శ్రీ విష్ణుతో చేసింది ఇదే మొదటి సినిమా. మొదట్లో ఆయన చాలా రిజర్వ్డ్ అని అనుకున్నా.. నేను కూడా రిజర్వ్డ్ పర్సన్నే. కానీ శ్రీవిష్ణు ఎంతో త్వరగా కలిసిపోయారు. ఆయన ఎంతో ఒదిగి ఉంటారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చింది.
రెడ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?.. సినిమాల పరంగా నేను సంతృప్తిగా ఉన్నాను. నాకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశాను అని అనిపించింది. నాకు సెట్ అయ్యే పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తాను. ఇంకా మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నాను. అలాంటి పాత్ర ఇలాంటి పాత్ర చేయాలనేమీ పెట్టుకోలేదు. నాకు ట్రెడిషనల్ పాత్రలే వస్తున్నాయి. సిటీ అమ్మాయి పాత్రలు చేయాలని ఉంది. గ్లామర్ రోల్స్ నాకు కంఫర్టబుల్‌గా ఉండదు. స్పోర్ట్స్ అంటే నాకు ఇష్టం. స్కూల్‌లో బాస్కెట్ బాల్ ఆడేదాన్ని. సినిమాల్లోకి వచ్చాకే తెలుగు నేర్చుకున్నాను. నేను తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తాను. నాకు హీరోల్లో అల్లు అర్జున్, హీరోయిన్ సమంత అంటే ఇష్టం. నాకు ఇలాంటి పాత్రలే చేయాలనే కోరిక ఏమీ లేదు. ప్రస్తుతం హను మాన్ సినిమాను చేస్తున్నాను. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :




