AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anasuya: పార్ట్ వన్‌లో డోస్ సరిపోలేదు.. రెండో పార్ట్‌లో ఆడుకుంటా.. : అనసూయ

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

Anasuya: పార్ట్ వన్‌లో డోస్ సరిపోలేదు.. రెండో పార్ట్‌లో ఆడుకుంటా.. : అనసూయ
Ansuya
Rajeev Rayala
|

Updated on: Dec 23, 2021 | 9:38 AM

Share

Pushpa: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. గంధపు చెక్కల నేపథ్యంలో సాగె ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ క్యారెక్టర్ ల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక రీసెంట్ గా తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో అభిమానుల కోలాహలం మధ్య ఈ సినిమా సక్సెస్ పార్టీ జరిగింది. ఇక పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులకు ప్రశంసల వర్షం కురిపించేలా చేసింది అన్నారు అనసూయ భరద్వాజ్. అనసూయ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి.

తాజాగా పుష్ప సక్సెస్ పార్టీలో అనసూయ మాట్లాడుతూ.. ‘ సినిమా ఇంత అద్భుతమైన విజయం సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు. అల్లు అర్జున్ మేకోవర్ నేను ఊహించలేదు.. ఆయన ఒక అద్భుతం.. ఒక క్యారెక్టర్ కోసం ఇంతగా మారిపోవడం ఆయనకు మాత్రమే సాధ్యం  అవుతుందని అన్నారు. నా జీవితంలో మీరు చాలా కీలక పాత్ర పోషించారు అల్లు అర్జున్ గారు. మీరంటే నాకు చాలా ఇష్టం.. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా అన్ని చోట్ల ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆనందంగా ఉంది. సుకుమార్ గారి గురించి ఏం చెప్పాలి.. ఆయన నాకు గురువు.. నటిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. సినిమాలో దాక్షాయని పాత్ర డోస్ సరిపోలేదు అని అభిమానులు చెబుతున్నారు. రెండో భాగం ఆడుకుంటాను. ఇలాంటి సినిమా నిర్మించాలంటే కేవలం మైత్రి మూవీ మేకర్స్ కు మాత్రమే సాధ్యమవుతుంది. వాళ్లకు ఉన్న డెడికేషన్ అలాంటిది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుకుమార్ గారికి, అల్లు అర్జున్ గారికి, మైత్రి మూవీ మేకర్స్ కు ధన్యవాదాలు..’ అని చెప్పుకొచ్చింది. ఇక పుష్ప సినిమాలో అనసూయ నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Konidela Upasana: ప్రధానమంత్రితో సమావేశమైన మెగా కోడలు.. ఎందుకంటే..

RRR: జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!

Kamal Haasan: విక్రమ్‌ సెట్‌లోకి అడుగుపెట్టిన కమల్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే!

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..