Radhe Shyam: హైదరాబాద్‌కు తరలివస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ ఈవెంట్‌కు 40వేల మందికి పైగా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాలతర్వాత ప్రభాస్ నుంచి సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు.
Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాలతర్వాత ప్రభాస్ నుంచి సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. జిల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న రాధేశ్యామ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిరియాడికల్ లవ్ డ్రామాగా తెరక్కేక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా ప్రభాస్ కు జోడీగా బుట్టబొమ్మ పూజహెగ్డే నటిస్తుంది. ఇక ఈ సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తూఉంది. ఇండియాలో మరే సినిమాకు సాధ్యంకాని స్థాయిలో ఓకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు రాధే శ్యామ్ టీం.
ఇక వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇటలీలో జరిగే ప్రేమకథగా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కుమార్. ఈ సినిమాలో రెబల్‌స్టార్ ప్రభాస్ విక్రమాదిత్యగా ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమా 14 జనవరి 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో జరగనున్న ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలి రానున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ కార్యక్రమానికి రానున్నారు. నేడు (23న )న ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుండటంతో ఇప్పటికే అభిమానులు హైదరాబాద్ కు చేరుకున్నారు. 40 వేల మందికి పైగా ఈ ప్రీరిలీ ఈవెంట్ కు రానున్నారని అంచనావేస్తున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్త్ ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :