AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: ఆ టైంలో సూర్యని చూడాలంటే చాలా భయమేసింది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

రెగ్యులర్ కథలు కాకుండా సూర్య చాలా డిఫరెంట్ స్టోరీస్ తో సినిమాలు చేస్తుంటారు. అలాగే ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు కూడా చేశారు సూర్య. గజినీ సినిమాతో తెలుగులో ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్న సూర్య. సింగం సిరీస్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అలాగే ఆయన నటించిన జై భీమ్ , ఆకాశం నీ హద్దురా సినిమాలు ప్రేక్షకుల మనసులను హత్తుకున్నాయి.

Suriya: ఆ టైంలో సూర్యని చూడాలంటే చాలా భయమేసింది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Radhika Madan, Surya
Rajeev Rayala
|

Updated on: Jul 25, 2024 | 4:58 PM

Share

తమిళ్ స్టార్ హీరో సూర్య కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఏంఎస్ ధోని కూడా సూర్యకు పెద్ద అభిమాని. తెలుగులోనూ సూర్యకు మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రెగ్యులర్ కథలు కాకుండా సూర్య చాలా డిఫరెంట్ స్టోరీస్ తో సినిమాలు చేస్తుంటారు. అలాగే ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు కూడా చేశారు సూర్య. గజినీ సినిమాతో తెలుగులో ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్న సూర్య. సింగం సిరీస్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అలాగే ఆయన నటించిన జై భీమ్, ఆకాశం నీ హద్దురా సినిమాలు ప్రేక్షకుల మనసులను హత్తుకున్నాయి. సూర్య గ్రేట్ యాక్టర్ అని పెద్ద పెద్ద స్టార్సే ఒప్పుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ సూర్య ను చూడటానికి భయపడ్డాను అని చెప్పి షాక్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి : Tollywood : ఈ నాన్న కూచి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఇండియానే షేక్ చేస్తున్న హీరోయిన్ ఆమె..

సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా రీసెంట్ గా హిందీలో రీమేక్ అయ్యింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటించారు. అలాగే ఈ రాధికా మదన్‌ హీరోయిన్ గా నటించింది. ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సినిమా ప్రీమియర్స్ ను వేసినప్పుడు హీరో సూర్య కూడా సర్ఫిరా సినిమాను చూశారు. ఆయన సినిమా చూస్తున్నంత సేపూ నేను సూర్యను చూడటానికి భయపడ్డాను.

ఇది కూడా చదవండి : Krishna Vamsi: ఆయన్ని అలా చూస్తే నేను తట్టుకోలేను.. కన్నీళ్లు పెట్టుకున్న కృష్ణవంశీ

సూర్య చాలా మంచి వ్యక్తి.. ఆయన చాలా సైలెంట్ గా ఉంటారు. పెద్దగా మాట్లాడారు.. చాలా సౌమ్యంగా ఉంటారు సూర్య. ఆయనకు నా నటన నచ్చుతుందో లేదో అని చాలా భయపడ్డాను. సర్ఫిరా సినిమాను సూర్య చూస్తున్నంత సేపు నేను చాలా భయపడ్డాను. సినిమా చూసిన తర్వాత నా దగ్గరకు వచ్చి సినిమా బాగుంది.. చాలా బాగా నటించావ్ అని అన్నారు. అంతే నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదే విషయాన్నీ దర్శకురాలు సుధ కొంగరూ కు చెప్పాను. సూర్య చెప్పాడు అంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఆమె అన్నారు. అని తెలిపింది రాధికా మదన్‌. ఈ అమ్మడి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సూర్య నటించిన ‘సూరారై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా) సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సర్ఫిరా సినిమా థియేటర్స్ లో విడుదలైంది. సినిమా కథ బాగున్నప్పటికీ ఎమోషన్స్ సరిగ్గా పండలేదు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.