AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ గెలిచేందుకు కుమారీ ఆంటీ బిగ్ స్కెచ్.. ఏకంగా పవన్ కల్యాణ్‌ను..

. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో కుమారి ఆంటీ అడుగు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ఇప్పటికే స్టార్ మా ఛానెల్స్ లో ప్రసారమైన పలు టీవీ షోల్లో సందడి చేసిన ఆమెను బిగ్ బాస్ హౌజ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హౌజ్ లోకి వచ్చేందుకు కుమారీ ఆంటీ కూడా ఆసక్తికరంగా ఉందని తెలుస్తోంది. అందుకే ఇప్పటి నుంచే తన ప్రమోషన్స్ ను షురు చేసిందామె.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ గెలిచేందుకు కుమారీ ఆంటీ బిగ్ స్కెచ్.. ఏకంగా పవన్ కల్యాణ్‌ను..
Bigg Boss Telugu Season 8
Basha Shek
|

Updated on: Jul 25, 2024 | 4:55 PM

Share

కుమారి ఆంటీ అలియాస్ దాసరి సాయి కుమారి..తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేరు. హైదరాబాద్‌లోని రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేస్తోన్న ఈమె పేరు గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోతోంది. యూట్యూబ్‌ ఛానెల్స్, టీవీ ఛానెల్స్ ఆమె ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు టీవీ షోల్లో ఎంట్రీ కూడా ఇచ్చింది. అదే సమయంలో కుమారీ ఆంటీపై ట్రోల్స్ కూడా నడిచాయి. రోడ్ సైడ్ వ్యాపారం చేసుకునే ఆమెను అనవసరమైన పాపులారిటీ, క్రేజ్ తో బిగ్ బాస్ షోకు పంపించేలా ఉన్నారంటూ నెట్టింట పోస్టులు కూడా దర్శన మిచ్చాయి. ఇప్పుడీ మాటలే నిజమయ్యేలా ఉన్నాయి. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో కుమారి ఆంటీ అడుగు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ఇప్పటికే స్టార్ మా ఛానెల్స్ లో ప్రసారమైన పలు టీవీ షోల్లో సందడి చేసిన ఆమెను బిగ్ బాస్ హౌజ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హౌజ్ లోకి వచ్చేందుకు కుమారీ ఆంటీ కూడా ఆసక్తికరంగా ఉందని తెలుస్తోంది. అందుకే ఇప్పటి నుంచే తన ప్రమోషన్స్ ను షురు చేసిందామె.

బిగ్ బాస్ హౌజ్ లో ఎక్కువ రోజులు ఉండాలి, టైటిల్ గెలవాలంటే ఆట, మాట తీరుతో పాటు ఆడియెన్స్ వేసే ఓట్లు కూడా ఎంతో ముఖ్యం. ఈ విషయాన్ని కుమారీ ఆంటీ త్వరగానే గ్రహించినట్లుంది. అందుకే ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టింది. ఈ మధ్యన కుమారీ ఆంటీ ఏ ఇంటర్వ్యూ చూసినా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫొటో కనిపిస్తోంది. బేసిక్ గా ఆమె పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయినప్పటికీ.. ఇప్పుడు మరింత డోస్ పెంచింది. అందుకే ప్రతి ఇంటర్వ్యూలో పవన్ ఫొటో క్లారిటీగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. పవన్ ఫ్యాన్స్ ఆదరాభిమానాలు తనకు తోడైతే బిగ్ బాస్ హౌజ్ లో తనకు తిరుగుండదని కుమారీ ఆంటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బిగ్ బాస్ టైటిల్ గెలిచేందుకు ఆమె పెద్ద స్కెచ్చే వేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. +

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
Video:కష్టపడి మెట్లు ఎక్కిన దివ్యాంగ డెలివరీ బాయ్‌.. చివరకు షాక్
Video:కష్టపడి మెట్లు ఎక్కిన దివ్యాంగ డెలివరీ బాయ్‌.. చివరకు షాక్
తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చినా పేరు కనిపిస్తుంది!
తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చినా పేరు కనిపిస్తుంది!
వంట రాని వారు కూడా చేసుకోగలిగే ఈజీ చికెన్ పులావ్
వంట రాని వారు కూడా చేసుకోగలిగే ఈజీ చికెన్ పులావ్
బాన్సువాడలో నాటు బాంబుల పేలుడు.. ఆరుగురికి సీరియస్!
బాన్సువాడలో నాటు బాంబుల పేలుడు.. ఆరుగురికి సీరియస్!
బయటకు డెయిరీ ఫామ్.. లోపల మత్తు దందా..
బయటకు డెయిరీ ఫామ్.. లోపల మత్తు దందా..
హాఫ్ సెంచరీ తర్వాత వింత సెలబ్రేషన్స్.. అసలేంటీ ‘మాన వేవ్’ స్టోరీ
హాఫ్ సెంచరీ తర్వాత వింత సెలబ్రేషన్స్.. అసలేంటీ ‘మాన వేవ్’ స్టోరీ
సీతగా సాయి పల్లవి.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
సీతగా సాయి పల్లవి.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
మందార పూలతో ఇంట్లోనే నేచురల్ హెయిర్ కండిషనర్ తయారీ.. రఫ్‌గా ఉన్న
మందార పూలతో ఇంట్లోనే నేచురల్ హెయిర్ కండిషనర్ తయారీ.. రఫ్‌గా ఉన్న
వాట్సాప్ గ్రూప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 4 కొత్త ఫీచర్లు
వాట్సాప్ గ్రూప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 4 కొత్త ఫీచర్లు
ఆ వ్యాధితో చెల్లెలి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల
ఆ వ్యాధితో చెల్లెలి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల