AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Vamsi: ఆయన్ని అలా చూస్తే నేను తట్టుకోలేను.. కన్నీళ్లు పెట్టుకున్న కృష్ణవంశీ

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరిర్ మొదలు పెట్టిన కృష్ణవంశీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. గులాబీ సినిమాతో దర్శకుడిగా మారిన కృష్ణవంశీ తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. ఆతర్వాత చాలా సూపర్ హిట్ సినిమాలు చేశారు. నాగార్జునతో నిన్నే పెళ్ళాడుతాలాంటి రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. సింధూరం, చంద్రలేఖ, అంతఃపురం, సముద్రం లాంటి సూపర్ హిట్ సినిమాలు చేశారు.

Krishna Vamsi: ఆయన్ని అలా చూస్తే నేను తట్టుకోలేను.. కన్నీళ్లు పెట్టుకున్న కృష్ణవంశీ
Krishnavamshi
Rajeev Rayala
|

Updated on: Jul 24, 2024 | 5:06 PM

Share

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు కృష్ణవంశీ. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరిర్ మొదలు పెట్టిన కృష్ణవంశీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. గులాబీ సినిమాతో దర్శకుడిగా మారిన కృష్ణవంశీ తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. ఆతర్వాత చాలా సూపర్ హిట్ సినిమాలు చేశారు. నాగార్జునతో నిన్నే పెళ్ళాడుతాలాంటి రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. సింధూరం, చంద్రలేఖ, అంతఃపురం, సముద్రం లాంటి సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఆతర్వాత మహేష్ బాబుతో మురారి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అలాగే 2002లో ఖడ్గం సినిమాతో మరో భారీ హిట్ అందుకున్నారు. ఇలా ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి.

ఇదికూడా చదవండి : అనుపమ, బెల్లంకొండ మధ్యలో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుందా.? ఇప్పుడు చూస్తే అమ్మబాబోయ్ అనాల్సిందే

తాజాగా కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి మాట్లాడారు. తాను గురుజీగా భావించే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి ఎమోషనల్ అయ్యారు. కృష్ణవంశీకి సీతారామ శాస్త్రి ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. ఆయన రాసిన పాటలన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆయన శిఖరం. నేను ఒక గులకరాయి. ఈ రెండింటి మధ్య పోలికలు ఉండవు. రెండు రాళ్లే అయిఉండొచ్చు కానీ పోలిక ఉండదు. ఆయనకు నేను నచ్చడం నా అదృష్టం. నన్ను చేరదీశారు అని అన్నారు కృష్ణవంశీ.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లో ఊహించని ఎంట్రీ.. హౌస్‌లో అడుగుపెట్టనున్న హాట్ బ్యూటీ..!

ఖడ్గం , శ్రీఆంజనేయం,మహాత్మ, శశిరేఖా పరిణయం ఇలా ఈ సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ రాశారు. శ్రీఆంజనేయం సినిమా సాంగ్ లో రొమాన్స్ కు టచ్ అవ్వకుండా ఆంజనేయస్వామి తత్వం చెప్పారు. అలాగే శశిరేఖా పరిణయం సినిమాలోని పాటల్లో రామతత్వం, కృష్ణతత్వం రెండింటినీ చూపారు అని అన్నారు. అలాగే సీతారామ శాస్త్రి మరణం గురించి మాట్లాడుతూ.. ఆయన మరణ వార్త విని నేను షాక్‌కు గురయ్యాను. మూడు రోజులు పట్టింది దాని నుంచి బయటకు రావడానికి.. ఆయన్ని నిర్జీవంగా చూస్తే నేను తట్టుకోలేను. అందుకే ఆయన చనిపోయిన తర్వాత రాలేదు అని కన్నీళ్లు పెట్టుకున్నారు కృష్ణవంశీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
45 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కుమారుడు.. అసలు ట్విస్ట్ అక్కడే !
45 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కుమారుడు.. అసలు ట్విస్ట్ అక్కడే !
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగ‌లు..!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగ‌లు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు