Raashii Khanna: ఆ హీరో అంటే పిచ్చి.. ఎప్పటినుంచో అతడితో నటించాలనే కోరిక.. రాశి ఖన్నా..
తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ రాశి ఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది ఈ అమ్మడు. తాజాగా తనకు ఓ హీరో అంటే పిచ్చి ఇష్టమని చెప్పుకొచ్చింది.

తెలుగు సినిమా ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో రాశి ఖాన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి చిత్రంతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ ఆనతి కాలంలోనే తనకంటూ సెపరేట్ క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే కొన్నాళ్లుగా హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ అక్కడే సెటిల్ అయింది. చాలా కాలం తర్వాత ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది. ఇదెలా ఉంటే.. తాజాగా రాశి ఖన్నా గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తనకు ఇండస్ట్రీలో ఓ హీరో అంటే పిచ్చి ఇష్టమని.. అతడితో నటించాలనే కోరిక ఎప్పటినుంచో ఉందని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
రాశి ఖన్నా..తనకు ఇష్టమైన హీరో మరెవరో కాదండి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనతో నటించాలనే కోరిక ఎప్పటినుంచో ఉందని చెప్పుకొచ్చింది. మాములుగా తనకు కథ నచ్చితినే సినిమాకు ఓకే చెప్తానని.. కానీ హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల నటిస్తుంది. ఈ సినిమా స్క్రిప్ట్ వినకుండానే ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పానని తెలిపిందే. అందుకు కారణం పవన్ కళ్యాణ్ అని.. ఆయనతో నటించాలనే కోరిక ఎప్పటినుంచో ఉందని తెలిపింది.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..
పవన్ స్టార్ డమ్, క్రేజ్ చూసి బ్లైండ్ గా ఓకే చెప్పేశానని అంటుంది.కమర్షియల్ సినిమా అయినా.. హీరో చుట్టూ తిరిగే కథ అని తెలిసినా .. ఇలాంటి సినిమాలకు ఉండే రీచ్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని తెలిసి మరీ ఫిక్స్ అయిపోయానని తెలిపింది. సెట్ లో పవన్ వ్యక్తిత్వం చూశాక.. అభిమానం మరింత పెరిగిందని తెలిపిసింది. పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ సూపర్ ఉంటుందని.. అందరిని కలుపుకుపోతారని తెలిపింది. ప్రస్తుతం రాశి ఖన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?

Raashi Khanna, Pawan Kalyan
ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..




