Vithika Sheru: అందరికీ మీలాంటి అక్క ఉంటే బాగుండు.. చెల్లి సీమంతంలో వితిక ఏం చేసిందో చూశారా? వీడియో
మెట్టినింటి తర్వాత పుట్టింట జరిగిన ఈ సీమంతం వేడుకలో వితికా షేరు తన చెల్లికి ఓ సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చింది. దీనిని చూసిన కృతిక షేరు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. అక్కా చెల్లెళ్ల కు సంబంధించిన ఈ ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టాలీవుడ్ హీరోయిన్, వరుణ్ సందేశ్ సతీమణి వితికా షేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. అయితే వరుణ్ సందేశ్ తో పెళ్లయ్యాక సినిమాలు పూర్తిగా తగ్గించేసిందీ అందాల తార. అయితే అప్పుడప్పుడూ టీవీ షోస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్లలో సందడి చేస్తుంటుంది వితిక. ఇక భర్త, హీరో వరుణ్ సందేశ్ తో కలిసి బిగ్ బాస్ షోలో సందడి చేసింది అందాల తార. ఇదిలా ఉంటే వితిక సోదరి కృతికా షేరు త్వరలో తల్లికానుంది. కొన్ని రోజుల క్రితమే ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది కృతిక. ఇటీవలే తన చెల్లి సీమంతం వేడుకను గ్రాండ్‌గా నిర్వహించింది వితిక. అక్కగా అన్నీ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయింది వేడుక. ఇక ఇటీవలే మెట్టినింటి నుంచి పుట్టింటికి వచ్చింది కృతిక. దీంతో మరోసారి తన చెల్లి సీమంతాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది వితిక. అయితే ఈసారి తన చెల్లికి ఒక సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చింది వితిక.
మెట్టినింటి తర్వాత పుట్టింట జరిగిన సీమంతం వేడుకలో వితికా షేరు తన చెల్లికి జీవితంలో మరిచిపోలేని ప్రదర్శన ఇచ్చింది. ఈ వేడుకలో వితికా ఒక ప్రత్యేకమైన పాటతో అలరించింది. తన పెర్ఫామెన్స్ తో ఈ సీమంతం వేడుకను మరింత స్పెషల్‌గా మార్చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘అందరికీ నీలాంటి అక్క ఉంటే బాగుండు మేడమ్’ అంటూ వితికపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
చెల్లి సీమంతంలో వితిక.. వీడియో ఇదిగో..
View this post on Instagram
కాగా చిన్నప్పటి నుంచి చెల్లి కృతికని చంటిపాపలా చూసుకుంది వితిక. ఆమె పెళ్లిని కూడా తన చేతుల మీదుగానే చేసింది. 2022లో కృతిక, కృష్ణ వివాహం జరిగింది. ఇప్పుడు వీరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు.
కృతిక షేరు సీమంతం ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




