Nithiin: నితిన్‌తో స్టెప్పులేసిన అంజలి.. రా.. రా.. రెడ్డి అంటూ అదరగొట్టిన బ్యూటీ క్వీన్..
డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి,

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ (Nithiin) ప్రధాన పాత్రలో లేటేస్ట్ చిత్రం మాచర్ల నియోజకవర్గం (macherla niyojakavargam). డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇందులో మరో కథానాయిక అంజలి స్పెషల్ చేస్తున్నట్లుగా గతంలోనే ప్రకటించారు మేకర్స్. తాజాగా ఈ అంజలి, నితిన్ కాంబోలో రానున్న రా.. రా.. రెడ్డి పాటను విడుదల చేశారు మేకర్స్.
తాజాగా విడుదలైన పాటలో అంజలి మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. రా.. రా.. రెడ్డి అంటూ సాగే పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటను సింగర్ లిప్సిక పాడగా.. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. నితిన్, అంజలి కలిసి చేసే స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇందులో కేథరిన్ టెస్రా కీలకపాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ రీరికార్డింగ్ వర్క్ కూడా పూర్తయింది.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




