ఆ స్వామీజీని పెళ్లి చేసుకోవాలనుంది అంటున్న స్టార్ హీరోయిన్ .. మా ఇద్దరి పేర్లు కూడా దగ్గరగా ఉన్నాయంటూ..
దగ్గుబాటి రానా హీరోగా పరిచయం అయిన లీడర్ సినిమా నుంచి తెలుగులో ఎంట్రీ ఇచ్చారు అందాల నటి ప్రియా ఆనంద్. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్నా..
దగ్గుబాటి రానా హీరోగా పరిచయం అయిన లీడర్ సినిమా నుంచి తెలుగులో ఎంట్రీ ఇచ్చారు అందాల నటి ప్రియా ఆనంద్. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్నా.. ఆ తర్వాత తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. తర్వాత తమిళ్, కన్నడ సినిమాల్లో నటించారు. అక్కడా ప్రియా ఆనంద్ కు చెప్పుకోదగ్గ హిట్ మాత్రం రాలేదు. చాలా రోజుల తరవాత ఇప్పడు మళ్లీ తెలుగులో నటిస్తున్నారు ప్రియా. అక్కినేని యంగ్ హీరో సుశాంత్ నటిస్తోన్న ‘మా నీళ్ల ట్యాంక్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇటీవలే విడుదలైన ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ప్రియా తన పెళ్లి విషయమై షాకింగ్ విషయాన్ని చెప్పారు. తనకు స్వామి నిత్యానందను పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచేశారు. నిత్యానంద పైన ఇన్ని వ్యాఖ్యలు చేసిన, ఎన్ని వివాదాలు రేగినా ఆయనను చూడటానికి నిత్యం వేలమంది వస్తుంటారని.. ఆయన క్రేజ్ చూస్తే షాకింగ్ గా అనిపిస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: రోడ్డుమీద ప్రత్యక్షమైన డైనోసార్.. వ్యక్తిపై ఎటాక్
రౌడీ బేబీ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన దంపతులు..
Viral Video: ఈ బుడ్డోడి మాస్క్ చూస్తే నవ్వకుండా ఉండలేరు…
అటవీ ప్రాంతంలో వెళ్తున్న జీప్.. సడన్‌గా చిరుత ఎంట్రీ.. ఏంచేసిందో చూడండి
బైక్‌పై గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే.. దెబ్బకు ఫ్యూజులౌట్ !!