Pushpa 2: శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడు. కిమ్స్ ఆస్పత్రి వైద్యులు నిరంతరం బాలుడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం (డిసెంబర్ 23) పుష్ప 2 నిర్మాతలు శ్రీ తేజ్ ను పరామర్శించారు. వారి వెంట సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను పుష్ప 2 నిర్మాతలు పరామర్శించారు. సోమవారం (డిసెంబర్ 23)నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి కిమ్స్ ఆస్పత్రిక వెళ్లారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ఇక రాజకీయం చేయవద్దని, సినిమా హీరోల ఇళ్లపై దాడులు చేయడం దారుణమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పుష్పా 2 నిర్మాతలు 50 లక్షల చెక్కును మృతి చెందిన రేవతి..ఆమె కుమారుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు అందజేశారు. బాబు పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని దేవుడి దయవల్ల త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్లడం లేదని అన్ని పుకార్లు ఎవరు నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు. ఎవరి పైనా దాడులు చేసినా చట్టం ఊరుకోదని కఠిన చర్యలు తప్పవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌లు మాట్లాడుతూ.. ‘తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి తీరనిలోటు. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడు. బాధిత కుటుంబానికి మా వంతు సాయం చేయడానికి ఇక్కడకు వచ్చాం. వారి కుటుంబానికి ఎప్పటికీ అండగా నిలబడతాం’ అని హామీ ఇచ్చారు.
రేవతి భర్తతో మాట్లాడుతోన్న పుష్ప 2 నిర్మాతలు..
Mythri Movie makers donates Rs 50 lakhs to the family of the Sandhya Theater victim family pic.twitter.com/FBQlngM65V
— Teju PRO (@Teju_PRO) December 23, 2024
ప్రతీక్ ఫౌండేషన్ తరఫున రూ. 25 లక్షల విరాళం..
కాగా రెండు రోజుల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాలుడు శ్రీ తేజ్ ను పరామర్శించారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి.. బాలుడి తండ్రికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల చెక్ అందించారు. శ్రీ తేజ్ కుటుంబానికి అన్ని రకాల సహాయం అందిస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి