AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu: మోహన్ బాబుకు చుక్కెదురు..! బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.. నెక్స్ట్ ఏంటి..?

మీడియాపై దాడి, హత్యాయత్నం కేసులో నటుడు మోహన్‌బాబుకు చుక్కెదురైంది. మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.. టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ కోసం మోహన్‌బాబు మళ్లీ బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు.. బెయిల్ పిటీషన్ ను కొట్టివేయడంతో మోహన్ బాబు బుధవారం పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెబుతున్నారు.

Mohan Babu: మోహన్ బాబుకు చుక్కెదురు..! బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.. నెక్స్ట్ ఏంటి..?
Mohan Babu
Shaik Madar Saheb
|

Updated on: Dec 23, 2024 | 3:59 PM

Share

మీడియాపై దాడి, హత్యాయత్నం కేసులో నటుడు మోహన్‌బాబుకు చుక్కెదురైంది. మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.. టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ కోసం మోహన్‌బాబు మళ్లీ బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు.. దీనిపై ధర్మాసనం సోమవారం విచారించింది. మోహన్‌బాబు ఇండియాలోనే ఉన్నట్టు అఫిడవిట్ దాఖలు చేశారు.. తన మనవరాలిని చూసేందుకు దుబాయ్ వెళ్లి తిరుపతి వచ్చినట్టు అఫిడవిట్‌లో మోహన్ బాబు పేర్కొన్నారు. మోహన్‌బాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తరుపు లాయర్‌ వాదనలు వినిపించారు.. కాగా.. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి స్పందిస్తూ.. మోహన్‌బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని కోరారు. కాగా.. మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్ట్‌ రంజిత్ స్టేట్‌మెంట్‌ను జీపీ కోర్టుకు సమర్పించారు.. వాదనల అనంతరం బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

జల్‌పల్లిలోని ఇంట్లోకి తనను రానివ్వలేదంటూ మంచు మనోజ్‌ మీడియాను తీసుకుని ఆ ఇంటి దగ్గరికి వెళ్లారు. ఈ క్రమంలో ఆవేశంగా వచ్చిన మోహన్‌బాబు..తన స్పందన తీసుకోవడానికి ప్రయత్నించిన టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌పై తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో మోహన్‌బాబుపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ‌ఈ క్రమంలో మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మోహన్‌బాబు విజ్ఞప్తిని తోసిపుచ్చింది. మరోవైపు మోహన్‌బాబు, మనోజ్‌ వివాదంలో ఇప్పటికే పోలీసులు 3 FIRలు నమోదు చేశారు. ఇక జర్నలిస్టుపై దాడి కేసులో సినీనటుడు మోహన్‌బాబుపై కేసు నమోదు చేశామని చట్ట ప్రకారం ఆయనపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.. తెలంగాణ డీజీపీ జితేందర్‌.

జల్‌పల్లిలో మీడియాపై దాడి, హత్యాయత్నం కేసులో మోహన్‌బాబు ఇప్పటికింకా ఎంక్వయిరీ ఫ్రేమ్‌లోకి రాలేదు. డిసెంబర్ 24వ తేదీ వరకు ఆయనకు టైముంది. ఈ క్రమంలోనే హైకోర్టు బెయిల్ పిటీషన్ ను కొట్టివేయడంతో మోహన్ బాబు బుధవారం పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెబుతున్నారు.

లైవ్ వీడియో చూడండి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు