Pushpa 2: ఇక పై నో గ్యాప్.. వరుసగా సినిమాలు చేస్తానన్న ఐకాన్ స్టార్

అల్లు అర్జున్ ఊరమాస్ క్యారెక్టర్, లుక్ లో అదరగొట్టారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు పుష్ప 2తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు మూవీ టీమ్.

Pushpa 2: ఇక పై నో గ్యాప్.. వరుసగా సినిమాలు చేస్తానన్న ఐకాన్ స్టార్
సెన్సార్‌ బోర్డు యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చింది. సర్టిఫికెట్‌ సంగతి సరే, సినిమాలో కంటెంట్‌ ఎలా ఉందని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలే బయటికొచ్చాయి. ఫస్టాఫ్‌ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి.
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 28, 2024 | 10:50 AM

ఇక పై నో గ్యాప్ అంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ ఊరమాస్ క్యారెక్టర్, లుక్ లో అదరగొట్టారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు పుష్ప 2తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు మూవీ టీమ్. పుష్ప వన్ కంటే ఇప్పుడు పుష్ప 2ను మరింత యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇక ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు హీరో.. రీసెంట్‌గానే హిట్ కొట్టాడు

పుష్ప 2 సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలను పెంచేసాయి. ఇక పుష్ప 2 ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను పాట్నాలో రిలీజ్ చేశారు. అలాగే ప్రమోషన్స్ శరవేగంగా చేస్తున్నారు.

ఏంటీ..!ఈవిడ చంద్రముఖిలో వడివేలు భార్యా..! అందాలతో గత్తరలేపిందిగా..

ఇప్పటికే చెన్నైలో భారీ ఈవెంట్ ను నిర్వహించారు. అలాగే తాజాగా కేరళలో ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ ను నిర్వహించారు. అల్లు అర్జున్ కు కేరళలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ..” పుష్ప 2 నాకు చాలా స్పెషల్ మూవీ. మూడేళ్లుగా ఈ మూవీ జర్నీలో ఉన్నాను.  పుష్ప ను ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.. సినిమాలో నాకు ఫహాద్‌ ఫాజిల్‌ మధ్య వచ్చే సీన్స్‌ అందర్నీ అలరిస్తాయి. ఫహాద్‌ మరోసారి తన నటన తో ఆకట్టుకోనున్నాడు. మలయాళ ప్రేక్షకులంతా గర్వపడేలా ఆయన నటన ఉంటుంది.  20ఏళ్లుగా నాపై ప్రేమ, అభిమానాలు చూపిస్తున్న మలయాళ ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. మీకు ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని పుష్ప 2 సినిమాలో ఓ పాట మలయాళ లిరిక్స్‌తో  ఉండేలా సిద్ధం చేశాం. ఇక పై గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తా’ అని అల్లు అర్జున్ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

అయ్యో పాపం..! రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..