IPL Mega Auction 2025: LSG యజమానిపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన DC సహ-యజమాని పార్త్ జిందాల్

IPL 2025 వేలంలో, ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రూ. 14 కోట్లకు KL రాహుల్‌ను కొనుగోలు చేసింది. DC సహ-యజమాని పార్త్ జిందాల్, రాహుల్‌కు "అతనికి అర్హమైన ప్రేమ , గౌరవం లభిస్తుందని చెప్పారు. ఇది పరోక్షంగా LSG యజమాని సంజీవ్ గోయెంకాకు ఉద్దేశించి కామెంట్స్ చేసినట్లు కొందరు భావిస్తున్నారు. జిందాల్ తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, రాహుల్ DC కోసం రాబోవు సీజన్ లో అద్భుత ప్రదర్శన ఇస్తాడని చెప్పారు.

IPL Mega Auction 2025: LSG యజమానిపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన DC సహ-యజమాని పార్త్ జిందాల్
Parth Jindal And Sanjiv Goenka And Kl Rahul
Follow us
Narsimha

|

Updated on: Nov 28, 2024 | 10:48 AM

IPL 2025 మెగా వేలంలో KL రాహుల్‌ను రూ. 14 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC) సహ-యజమాని పార్త్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియా వేదికలపై పెద్ద చర్చకు కారణమయ్యాయి. రాహుల్ తన మాజీ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (LSG)ను విడిచిపెట్టిన వెంటనే, జిందాల్ మాట్లాడుతూ, “రాహుల్ తనకు తగిన ప్రేమ, గౌరవంతో అభివృద్ధి చెందుతాడు, DC అతనికి ఆ గౌరవాన్ని ఇస్తుంది” అని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు కొందరికి LSG యజమాని సంజీవ్ గోయెంకాను పరోక్షంగా ప్రస్తావించినట్టు అనిపించాయి. గోయెంకా గతంలో, జట్టుకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ, వ్యక్తిగత మైలురాళ్లకు దూరంగా ఉండే ఆటగాళ్లను కోరుకుంటున్నట్లు వెల్లడించినట్లు గుర్తుంచుకోవచ్చు. ఇది KL రాహుల్ ఢిల్లీలోక వచ్చిన తర్వాత కామెంట్స్ చేయండతో చర్చలకు కారణమైంది.

జిందాల్ స్పష్టంగా, KL రాహుల్ ఒక క్లాస్ ప్లేయర్ అని, అతను DC వాతావరణంలో రాణిస్తాడని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. “రాహుల్ ఢిల్లీ కోసం మెరుగైన ప్రదర్శన చూపించి, ఐపీఎల్ టైటిల్ గెలుస్తారని మేము ఆశిస్తున్నాం,” అని జిందాల్ అన్నారు. రాహుల్‌తో వారి స్నేహ బంధాన్ని ప్రస్తావిస్తూ, అతనికి అవసరమైన గౌరవం, ప్రేమ అందిస్తామని కూడా స్పష్టం చేశారు.

రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌ను లక్ష్యంగా పెట్టుకున్న DC, వారు అందుబాటులో రాకపోవడంతో KL రాహుల్‌ను ఎంపిక చేసుకోవాల్సి వచ్చిందని జిందాల్ ఒప్పుకున్నారు. ఈ ఇద్దరు పెద్ద ఆటగాళ్లపై పోటీలో దక్కించుకోలేకపోయిన తరువాత, వారు రాహుల్‌ కోసం గరిష్ఠ బిడ్డింగ్ చేయాలని నిర్ణయించారు. అక్షర్ పటేల్, ఫాఫ్ డు ప్లెసిస్ పేర్లను కూడా DC కెప్టెన్‌గా పరిశీలించినప్పటికీ, KL రాహుల్ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో LSGతో కెప్టెన్‌గా మూడు సీజన్లు గడిపిన అనుభవం, కెల్ రాహుల్ కెప్టెన్ గా మొదటి ఎంపిక అవనున్నట్లు తెలుస్తోంది.

రాహుల్‌పై DC యజమాని చేసిన ఈ ప్రకటనలు అతనిపై DC నమ్మకాన్ని చూపుతూనే, LSGతో అతని గత అనుభవాలపై పరోక్షంగా స్పందించినట్టుగా పరిగణిస్తున్నారు. ఈ వ్యవహారం అభిమానుల మధ్య ఆసక్తి రేకెత్తించడంతో పాటు రాహుల్ పై ఎల్ఎస్జీ యజమాని గోయెంకా ప్రవర్తించిన తీరు మరోసారి చర్చనీయాంశమైంది.