Yuzvendra Chahal: ధనశ్రీతో విడాకుల రూమర్స్.. కట్‌చేస్తే.. బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్

Yuzvendra Chahal and Shreyas Iyer in Bigg Boss 18: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీరి టాపిక్ ప్రధానంగా చెక్కర్లు కొడుతోంది. అయితే, ఈ క్రమంలో యుజ్వేంద్ర చాహల్ మరో క్రికెటర్‌తో కలిసి బిగ్ బాస్‌లోకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Yuzvendra Chahal: ధనశ్రీతో విడాకుల రూమర్స్.. కట్‌చేస్తే.. బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
Yuzvendra Chahal Dhanashree Verma
Follow us
Venkata Chari

|

Updated on: Jan 09, 2025 | 1:15 PM

Yuzvendra Chahal and Shreyas Iyer in Bigg Boss 18: గత కొన్ని రోజులుగా, భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ మధ్య విడాకుల వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. త్వరలో వీరిద్దరు విడిపోబోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. గత శనివారం, యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల నుంచి అన్‌ఫాలో చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.

ఆ తరువాత, ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ గురించి సోషల్ మీడియాలో రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి. అందరూ ధనశ్రీ వర్మ చేసిన తప్పును ఎత్తి చూపుతున్నారు. విడాకుల వార్తల మధ్య, దేశంలోనే అతిపెద్ద సమకాలీన షో బిగ్ బాస్ 18వ సీజన్‌లో యుజ్వేంద్ర చాహల్, శ్రేయాస్ అయ్యర్ కలిసి కనిపించబోతున్నారనే కీలక వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..

బిగ్ బాస్ లోకి యుజ్వేంద్ర చాహల్, శ్రేయాస్ అయ్యర్..

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా, అమన్ దేవగన్ తమ రాబోయే చిత్రం ‘ఆజాద్’ ప్రమోషన్ కోసం శనివారం బిగ్ బాస్ లైవ్ ఎపిసోడ్‌కు రానున్నారని తెలుస్తోంది. ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో భారత క్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, శశాంక్ సింగ్ కనిపించనున్నారని భావిస్తున్నారు. నిజానికి ఈ ముగ్గురు క్రికెటర్లు ఐపీఎల్ టీమ్ పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు. శశాంక్‌ను పంజాబ్ రిటైన్ చేయగా, మెగా వేలంలో శ్రేయాస్, చాహల్‌లను కొనుగోలు చేశారు. ఈ ఎపిసోడ్‌లో కమెడియన్ కృష్ణ అభిషేక్, అతని భార్య కశ్మీరా షా కూడా కనిపించబోతున్నారు.

ఈ వార్తలు వచ్చిన తర్వాత, యుజ్వేంద్ర చాహల్ బిగ్ బాస్‌కి వెళితే, అతను ధనశ్రీ వర్మ మధ్య వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇస్తాడని అంతా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్‌లో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని అభిమానులు తెలుసుకోవాలని చూస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..