'రోహిత్.. ఇంటికి వెళ్లి నీ కొడుకు డైపర్లు మార్చుకో': మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్

TV9 Telugu

9 January 2025

ఆస్ట్రేలియాలో పేలవమైన టెస్ట్ సిరీస్ తర్వాత, కెప్టెన్, బ్యాట్స్‌మెన్‌గా భారత టెస్ట్ జట్టులో రోహిత్ శర్మ భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తోంది. 

నిరంతర విమర్శల మధ్య, ఇప్పుడు రోహిత్ వన్డే కెరీర్‌పై సంక్షోభ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు రోహిత్ కెప్టెన్‌గా కొనసాగడం ఖాయం. 

ఆ తర్వాత రోహిత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతని కెప్టెన్‌గా ఉన్న మాజీ ఆస్ట్రేలియా లెజెండ్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కావచ్చు అంటూ ఆసీస్ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. కెరీర్ చివరి దశలో అత్యుత్తమ నిర్ణయం తీసుకోవచ్చు.

పాడ్‌కాస్ట్‌లో గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ, "రోహిత్ ఇంగ్లండ్ వెళ్లడం నేను చూడకపోవచ్చు. అతను ఇంటికి వెళ్లి విషయాలు గమనిస్తాడని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

'ఇంటికి వెళ్ళిన వెంటనే, రెండు పనులు చేస్తాడు. ఒక నెల పాటు తన కొడుకు డైపర్లు మార్చుతాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ అవుతాడు' అంటూ తెలిపాడు.

రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ ఇక్కడితో ముగిస్తే, భారత్ ఇప్పుడు ఈ ఫార్మాట్‌లో కొత్త కెప్టెన్ కోసం వెతకాలి. గిల్‌క్రిస్ట్ టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ గురించి కూడా మాట్లాడాడు. తదుపరి టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పేరును సూచించాడు. 

సిడ్నీ టెస్టులో రోహిత్ ఆడలేదు. జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే బుమ్రా గాయపడటంతో కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.