Liger Movie: లైగర్ కోసం భారీ సెట్ వేయించనున్న పూరీ.. ఏకంగా ఫారిన్ సెట్ హైదరాబాద్ కు..

"స్టోరీ రాయడానికో 7 రోజులు, డైలాగ్స్‌ స్క్రీన్‌ ప్లే రాయడానికి మరో 7 రోజులు..ఇక సినిమా తీసేందుకు మాక్జిమమ్‌ 60 నుంచి 80 రోజులు" ఇలా డేస్‌ ప్లాన్‌ చేసుకుని విత్ ఇన్‌ద డేస్‌ సినిమాని పూర్తి చేసే పూరీ....

Liger Movie: లైగర్ కోసం భారీ సెట్ వేయించనున్న పూరీ.. ఏకంగా ఫారిన్ సెట్ హైదరాబాద్ కు..
Liger
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 12, 2021 | 5:17 PM

liger movie : “స్టోరీ రాయడానికో 7 రోజులు, డైలాగ్స్‌ స్క్రీన్‌ ప్లే రాయడానికి మరో 7 రోజులు..ఇక సినిమా తీసేందుకు మాక్జిమమ్‌ 60 నుంచి 80 రోజులు” ఇలా డేస్‌ ప్లాన్‌ చేసుకుని విత్ ఇన్‌ ద డేస్‌ సినిమాని పూర్తి చేసే పూరీ.. లైగర్‌ సినిమా కోసం కూడా ఓ ప్లాన్‌ వేశారట. కరోనా కారణంగా ఇప్పటికే లేటైన సినిమాను త్వరగా కంప్లీట్ చేసేందుకు ఇప్పుడా ప్లాన్‌ను ఫర్ఫెక్ట్గా ఎక్జిగుటివ్ చేయాలని కూడా చూస్తున్నారట. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “లైగర్”. పాన్ ఇండియా సినిమాగా పిక్చరైజ్‌ అవుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా… పూరీ, ఛార్మీ, కరణ్ జోహర్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందనున్న చిత్రం కావడంతో కథానుగుణంగా ఈ సినిమాలోని కొన్ని సీన్లను ఫారెన్ లో తెరకెక్కించాల్సి ఉందట. కాని కరోనా కారణంగా అది కుదరకపోవడంతో.. అందుకు తగ్గట్టు ఓ ఫారెన్‌ సెట్ ను హైదరాబాద్‌లో వేయించారట పూరీ.

ఇప్పుడా సెట్‌లో షూటింగ్ స్టార్ట్‌ చేసేందుకు రెడీ అవుతున్నారట లైగర్‌ టీం. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సినిమాలోని రిమైనింగ్ షూట్ను కంప్లీట్‌ చేయనున్నారట. ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Santosh Sobhan : వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో.. కొత్త సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్స్..

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో జోరుమీద పవర్ స్టార్..

Vikram Look Cobra: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు.. స్టార్ హీరో విక్ర‌మ్‌.. న‌మ్మ‌శ‌క్యంగా లేదు క‌దూ..!