Vikram Look Cobra: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు.. స్టార్ హీరో విక్ర‌మ్‌.. న‌మ్మ‌శ‌క్యంగా లేదు క‌దూ..!

Vikram Look Cobra: విల‌క్ష‌ణ న‌ట‌న‌కు పెట్టింది పేరు న‌టుడు విక్ర‌మ్‌. సినిమా సినిమాకు కొత్త వేరియేష‌న్ చూపిస్తూ త‌న‌లోని న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తుంటాడీ ట్యాలెంట్‌డ్ హీరో. 55 ఏళ్ల వ‌య‌సులోనూ...

Vikram Look Cobra: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు.. స్టార్ హీరో విక్ర‌మ్‌.. న‌మ్మ‌శ‌క్యంగా లేదు క‌దూ..!
Vikram New Look
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 12, 2021 | 4:08 PM

Vikram Look Cobra: విల‌క్ష‌ణ న‌ట‌న‌కు పెట్టింది పేరు న‌టుడు విక్ర‌మ్‌. సినిమా సినిమాకు కొత్త వేరియేష‌న్ చూపిస్తూ త‌న‌లోని న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తుంటాడీ ట్యాలెంట్‌డ్ హీరో. 55 ఏళ్ల వ‌య‌సులోనూ విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ యంగ్ హీరోల‌కు సైతం పోటీనిస్తున్నాడు. ఇక విక్ర‌మ్ సినిమాల్లో త‌న పాత్ర‌లు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అద్భుత న‌ట‌న‌తోనే కాకుండా గెటప్‌ల‌తోనూ ఆక‌ట్టుకుంటాడు. తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్‌ క్యారెక్ట‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న కోబ్రా అనే సినిమాలో విక్ర‌మ్ ఏకంగా 20 బిభిన్న గెట‌ప్‌ల‌లో క‌నిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే విక్ర‌మ్‌కు సంబంధించి విడుద‌లైన కొన్ని ఫొటోలు నెట్టింట్లో ర‌చ్చ చేశాయి. ఇక ద‌ర్శ‌కుడు జ్ఞాన ముత్తు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా పోస్ట్ చేసిన ఓ ఫొటో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. క‌రోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. అయితే తాజాగా ప‌రిస్థితుల్లో మార్పులు వ‌స్తోన్న స‌మ‌యంలో చిత్ర యూనిట్ తిరిగి సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇదే విష‌యాన్ని ప్రేక్ష‌కుల‌తో పంచుకున్న ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కొత్త లుక్‌ను పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో క్రికెట‌ర్ ఇర్ఫాన్ ఖాన్ ఇంటర్‌పోల్ అధికారి పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

ద‌ర్శ‌కుడు పోస్ట్ చేసిన ఫొటో..

కోబ్రా సినిమా టీజ‌ర్‌..

ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!