Puri Jagannadh: బాలీవుడ్ హీరోతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ..
స్టార్ డైరెక్టర్లంతా ఒక సినిమా చేతిలో ఉండగానే మరో సినిమాను ఫైనల్ చేసేస్తున్నారు. కానీ డాషింగ్ డైరెక్టర్ పూరి మాత్రం తన నెక్ట్స్ సినిమా విషయంలో..
Puri Jagannadh: స్టార్ డైరెక్టర్లంతా ఒక సినిమా చేతిలో ఉండగానే మరో సినిమాను ఫైనల్ చేసేస్తున్నారు. కానీ డాషింగ్ డైరెక్టర్ పూరి మాత్రం తన నెక్ట్స్ సినిమా విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రజెంట్ లైగర్ పనుల్లో బిజీగా ఉన్న పూరి.. నెక్ట్స్ సినిమా ఏంటి..? లైగర్‌తో పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్న ఈ క్రేజీ డైరెక్టర్ నెక్ట్స్ మూవీ కూడా ఆ రేంజ్‌లోనే ఉండబోతుందా? లైగర్ తరువాత పవన్ కల్యాణ్ సినిమా చేసే ఆలోచనలో పూరి ఉన్నట్టుగా కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కేజీఎఫ్ స్టార్ యష్‌తోనూ పూరీ ఓ మాస్ యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల గురించి ఫుల్ క్లారిటీ నేను మీకిస్తా.
పవన్‌తో సినిమా అని, యష్ సినిమా అని వస్తున్న వార్తలన్నీ ఫేకే… యస్… లైగర్ తరువాత ఓ స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా చేస్తున్నారు పూరి జగన్నాథ్. లైగర్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బ్యానర్‌లో ఓ బాలీవుడ్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నారు. లైగర్ ఫైనల్ స్టేజ్‌కు రాగానే ఆ మూవీ వర్క్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు పూరి జగన్నాథ్.
మరిన్ని ఇక్కడ చదవండి :