AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిన సమయం ఇది.. ఓ మంచి పనికి ముందుకు రండి..

కరోనా మహమ్మారి దెబ్బకు దేశమంతా అల్లాడిపోతోంది. ఇప్పటికే వందలాది  ఈ వైరస్ వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నారు.

Rashmika Mandanna: ఒకరికొకరు సహాయం  చేసుకోవాల్సిన సమయం ఇది.. ఓ మంచి పనికి ముందుకు రండి..
Rashmika Mandanna
Rajeev Rayala
|

Updated on: Jun 05, 2021 | 6:05 AM

Share

Rashmika Mandanna: కరోనా మహమ్మారి దెబ్బకు దేశమంతా అల్లాడిపోతోంది. ఇప్పటికే వందలాది  ఈ వైరస్ వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేల మంది ఆసుపత్రుల పాలయ్యారు. కరోనా కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అధికారులు , వైద్యులు, సినిమా తారలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఎవరికి వారు తమకు తోచిన సాయం చేస్తూ మానవతను చాటుకుంటున్నారు. ఇంకా చాలా మంది ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో అందాల భామ రష్మిక మందన కూడా   ప్రచార సాయానికి ముందుకొచ్చింది.  ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది రష్మిక. “అందరు సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నా.. ప్రస్తుతం మనం అత్యంత క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నాం. ఇది మనకు ఓ సవాల్ గా మారింది. దీని నుంచి బయటపడడానికి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అందులో భాగంగా 25 లక్షల కోవిడ్ కేర్ హెల్త్ కిట్లను ఉచితంగా పంపిణీ చేసే ఒక పనిలో భాగస్వాములు కండి. దీనిని అందరు ప్రచారం చేయండి. ఇది ఏకం కావడానికి.. కలిసి పనిచేయడానికి.. ఇతరులను ప్రేరేపించడానికి సరైన సమయం. కాబట్టి మీరు ఈ ముఖ్యమైన సందేశాన్ని అందరికీ పంచుతారనే అనుకుంటున్నా. అవసరమైన వారికి సహాయపడండి“ అని తెలిపింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది. తెలుగులో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా చేస్తుంది. ఈ సినిమాలో గిరిజన యువతిగా రష్మిక కనిపించనుంది. ఆడాళ్లు మీకు జోహార్లు అనే చిత్రంలోనూ నటిస్తోంది. బాలీవుడ్ లో అమితాబ్ తో కలిసి గుడ్ బాయ్ అనే చిత్రంతో పాటు మాల్హోత్రతో కలిసి మిషన్ మంజులో నటిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Thane Sex Racket Busts: కరోనా కరువు కాలంలో దారితప్పుతున్న తారాలోకం.. ఈజీమనీ కోసం స్టార్‌ స్టేటస్‌తో దందా!

Samantha Akkineni: ‘జెస్సీ’గా కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది.. టాలీవుడ్ ఇండస్ట్రీని మకుటం లేని మహారాణిగా ఏలుతున్న సమంత…