Anjali: ఇండస్ట్రీలో ఛాన్స్‌లు రావాలంటే టాలెంట్ ఉండాలంటున్న అందాల అంజలి..
కొత్త హీరోయిన్ల ఎంట్రీతో సీనియర్లకు ఛాన్స్‌లు తగ్గుతాయన్న ఫార్ములాను నేను అస్సలు నమ్మనంటున్నారు టాలీవుడ్ సీతమ్మ అంజలి.
Anjali: కొత్త హీరోయిన్ల ఎంట్రీతో సీనియర్లకు ఛాన్స్‌లు తగ్గుతాయన్న ఫార్ములాను నేను అస్సలు నమ్మనంటున్నారు టాలీవుడ్ సీతమ్మ అంజలి. షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన భామ అంజలి, తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించింది. రీసెంట్‌గా వకీల్ సాబ్‌తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ భామ…. అవకాశాలు రావట్లేదన్న వార్తలపై రియాక్ట్ అయ్యారు. న్యూ టాలెంట్ వల్లే తనకు ఆఫర్స్ రావటం లేదన్న వార్తలను కూడా కొట్టి పడేశారు. `ఇండస్ట్రీలో ఛాన్స్‌లు రావాలంటే టాలెంట్ ఉండాలి… నీకు టాలెంట్ ఉంటే.. అవకావాలు అవే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి` అంటూ వేదాంతం మాట్లాడుతున్నారు. మిగతా హీరోయిన్స్ చేస్తున్న క్యారెక్టర్స్ నాకొస్తే బాగుండనుకోవటం కూడా కరెక్ట్ కాదంటున్నారు అంజలి. అది కంప్లీట్‌గా మేకర్స్ ఛాయిస్.. వాళ్లు క్యారెక్టర్‌కు ఎవరు కరెక్ట్ అనుకుంటే వాళ్లనే పిక్ చేసుకుంటారన్నారు.
కెరీర్‌లో అనుష్క, సమంత లాంటి స్టార్ హీరోయిన్లతో పాటు నివేదా లాంటి యంగ్ జనరేషన్ హీరోయిన్లతోనూ కలిసి నటించిన అంజలి.. వాళ్లలో ఎవరినీ తనకు పోటి అనుకోలేదంటున్నారు. అంతేకాదు.. సీనియర్ అయినా.. జూనియర్ అయినా.,.. కో ఆర్టిస్ట్ నుంచి ఎంతో కొంత నేర్చుకునే ఛాన్స్ అయితే ఉందన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :