సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పోస్ట్ మీద ఫన్నీగా రియాక్ట్ బన్నీ బ్రదర్.. బిరుదులకి నో చెప్పిన లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి అంటూ ..
జెండర్ డిస్క్రిమినేషన్ మీద మరోసారి సెటైర్ వేశారు టాలెంటెడ్ డైరెక్టర్ నందినీ రెడ్డి. లేడీ డైరెక్టర్ అన్న పదంలో 12 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి..
జెండర్ డిస్క్రిమినేషన్ మీద మరోసారి సెటైర్ వేశారు టాలెంటెడ్ డైరెక్టర్ నందినీ రెడ్డి. లేడీ డైరెక్టర్ అన్న పదంలో 12 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి.. నందినీ రెడ్డి అనే నా పేరులోనూ 12 ఆల్ఫాబెట్సే ఉన్నాయి.. రెండు పదాలు టైప్ చేయడానికి సేమ్ ఎఫర్ట్.. అలాంటప్పుడు చక్కగా నా పేరు వాడితే ఆనందిస్తా.. అంటూ ఓ సర్కాస్టిక్ మెసేజ్‌ను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు అలా మొదలైంది డైరెక్టర్. అలా మొదలైంది సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన నందినీ రెడ్డి.. తరువాత జబర్థస్త్, కల్యాణ వైభోగమే లాంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. ఓబేబీతో మరో బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకోవటమే కాదు.. డిజిటల్‌లోనూ దర్శకురాలిగా సత్తా చాటుతున్నారు.
ఫిలిం ఇండస్ట్రీలో జెండర్ ఇనీక్వాలిటీస్ మీద చాలా కాలంగా తనదైన స్టైల్‌లో రియాక్ట్ అవుతున్నారు నందినీ.. మేల్ డైరెక్టర్స్‌కు ఈక్వల్‌గా ఫీమేల్ డైరెక్టర్స్ కూడా సక్సెస్‌లు సాధిస్తున్నారు.. అంతే ఎఫర్ట్‌తో వర్క్ చేస్తున్నారు. అయితే మేల్స్‌ను డైరెక్టర్ అని చెబుతూ.. ఫీమేల్స్‌ను స్పెషల్‌గా లేడీ డైరెక్టర్ అనటం ఏంటి అన్నది నందనీ రెడ్డి క్వశ్చన్. నందినీ చేసిన రీసెంట్ పోస్ట్‌కు సెలబ్రిటీల నుంచి కూడా గట్టి మద్దతు లభిస్తోంది. యంగ్ హీరో అల్లు శిరీష్… ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పోస్ట్ మీద ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. `బిరుదులకి నో చెప్పిన లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి` అని యూట్యూబ్ థంబ్ నెయిల్స్ పెడతారంటూ మీడియా వాళ్ల మీద సెటైర్ వేశారు.
మరిన్ని ఇక్కడ చదవండి :