Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న న్యూస్.. సర్కారు వారి పాటలో..
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో మరో సీనియర్ హీరో నటిస్తున్నారన్న న్యూస్ కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ సర్కారువారిపాట..
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో మరో సీనియర్ హీరో నటిస్తున్నారన్న న్యూస్ కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ సర్కారువారిపాట సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. మల్టీ లింగ్యువల్ స్టార్ అర్జున్ ఈ సినిమాలో నెగెటివ్ రోల్‌లో కనిపించబోతున్నారన్నది ఫిలిం నగర్ టాక్. అయితే ఈ న్యూస్ మహేష్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోంది. అందుకు ఓ సాలిడ్ రీజన్ కూడా ఉంది. టాలీవుడ్ లో హీరో అర్జున్ రికార్డ్ ఏమంత బాలేదు. ఆయన నెగెటివ్ రోల్‌లో నటించిన లై, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో దారుణంగా ఫెయిల్ అయ్యాయి. తెలుగులో క్యారెక్టర్ రోల్స్‌లోనూ అర్జున్ సక్సెస్ చూసి దశాబ్దాలు గడిచిపోయాయి. ఇదే ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్న అంశం.
ఫ్లాప్ రికార్డ్ ఉన్న అర్జున్ లాంటి హీరో మహేష్ మూవీలో చేస్తే రిజల్ట్ తేడా కొట్టేస్తుందేమో అన్న టెన్షన్‌లో ఉన్నారు ఫ్యాన్స్. అయితే సర్కారువారి పాటలో అర్జున్ క్యారెక్టర్‌కు సంబంధించి ఇంత వరకు అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ అయితే రాలేదు కాబట్టి.. ఫ్యాన్స్ టెన్షన్‌ను మూవీ టీమ్ కన్సిడర్ చేస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని టాక్. ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు మహేష్.
మరిన్ని ఇక్కడ చదవండి :