Tollywood : మోస్ట్‌ డిజైరబుల్‌ సెలబ్రిటీల లిస్ట్‌లో తెలుగు స్టార్స్‌ హవా.. హీరోయిన్స్ లో నెంబర్ వన్‌గా లక్కీ బ్యూటీ..

భాషేదైనా టాప్‌ చైర్‌ మాత్రం మాదే అంటున్నారు టాలీవుడ్ స్టార్స్‌. రీసెంట్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ సెలబ్రిటీల లిస్ట్‌లో సౌత్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ తెలుగు స్టార్స్‌ హవా స్పష్టంగా కనిపించింది.

Tollywood : మోస్ట్‌ డిజైరబుల్‌ సెలబ్రిటీల లిస్ట్‌లో తెలుగు స్టార్స్‌ హవా.. హీరోయిన్స్ లో నెంబర్ వన్‌గా లక్కీ బ్యూటీ..
Rashmika Mandanna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 05, 2021 | 8:46 AM

Tollywood :

భాషేదైనా టాప్‌ చైర్‌ మాత్రం మాదే అంటున్నారు టాలీవుడ్ స్టార్స్‌. రీసెంట్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ సెలబ్రిటీల లిస్ట్‌లో సౌత్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ తెలుగు స్టార్స్‌ హవా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఏ లాంగ్వేజ్‌లో అయిన తెలుగు టాప్ హీరోయిన్లే టాప్‌ చైర్స్‌ను ఆక్యుపై చేశారు. ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా ఉన్న రష్మిక మందన్న ఈ లిస్ట్‌లోనూ నెంబర్ వన్ అనిపించుకున్నారు. బెంగళూరు హీరోయిన్స్ లిస్ట్‌లో నెంబర్ వన్‌గా నిలిచిన ఈ భామ.. తెలుగు, తమిళ భాషల్లోనూ టాప్‌ 5లో ప్లేస్ సంపాదించుకున్నారు. మరో స్టార్ హీరోయిన్‌ సమంత కూడా తన ఇమేజ్‌ను కాపాడుకున్నారు. కోలీవుడ్‌లో నెంబర్ వన్‌ ప్లేస్‌లో నిలిచిన సామ్‌… తెలుగులో మాత్రం సెకండ్‌ ప్లేస్‌తో సరిపెట్టుకున్నారు. సాండల్‌ వుడ్‌లో అయితే సమంత ఊసే కనిపించలేదు.

తెలుగు లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్న శృతి హాసన్‌… తమిళనాట మాత్రం కాస్త వెనకపడ్డారు. ఓన్ లాంగ్వేజ్‌ అయినా అక్కడ పెద్దగా సక్సెస్‌లు లేకపోవటం.. శృతి తమిళ సినిమాలేవి రీసెంట్‌గా రిలీజ్ కాకపోవటంతో ఈ బ్యూటీ 13th ప్లేస్‌తో సరిపెట్టుకున్నారు. సీనియర్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్‌, తమన్నాలు కూడా రెండు భాషల్లో సత్తా చాటారు. తెలుగుతో పాటు తమిళ నాట కూడా మోస్ట్ డిజైరబుల్ లిస్ట్‌లో తమ ప్లేస్‌ కాపాడుకున్నారు ఈ బ్యూటీస్‌. లాస్ట్ ఇయర్‌ సినిమాలు లేకపోయినా.. డిజిటల్ ఎంట్రీతో ఆడియన్స్‌తో టచ్‌లో ఉండటం ఈ సీనియర్ల హీరోయిన్లకు కలిసోచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Rakul Preet Singh : సెట్‌లో అడుగుపెట్టేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..

Rashmika Mandanna: ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిన సమయం ఇది.. ఓ మంచి పనికి ముందుకు రండి..

Santosh Shoban: జోరు పెంచిన కుర్రహీరో.. వరుస సినిమాలతో బిజీబిజీ.. త్వరలో ప్రేమ్ కుమార్ గా ప్రేక్షకుల ముందుకు..