Puri: మనకు జబ్బులు రావడానికి అసలు కారణం అదే.. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే.. పూరీ మార్క్ విశ్లేషణ..
Puri Musings: టాలీవుడ్‌లో ఉన్న విలక్షణ దర్శకుల్లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ముందు వరసులో ఉంటాడు. చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించే పూరీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన డైరెక్షన్‌తో పాటు డైలాగ్‌లను కూడా...
Puri Musings: టాలీవుడ్‌లో ఉన్న విలక్షణ దర్శకుల్లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ముందు వరసులో ఉంటాడు. చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించే పూరీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన డైరెక్షన్‌తో పాటు డైలాగ్‌లను కూడా ఎంతగానో అభిమానిస్తుంటారు. పంచ్ డైలాగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే పూరీ.. తన సంభాషణల్లో జీవిత సారాన్ని కూడా వివరిస్తుంటారు. ఇదిలా ఉంటే ఈ క్రమంలో పూరీ జగన్నాథ్ వివిధ అంశాలకు సంబంధించిన అంశాలపై విశ్లేషణను యూట్యూబ్ వేదికగా పంచుకుంటున్న విషయం తెలిసిందే. పూరీ మ్యూజింగ్స్ పేరుతో పలు అంశాలపై పూరీ తనదైన శైలిలో మాట్లాడుతుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా లిక్ ది బౌల్ అనే అంశంపై మాట్లాడాడు. ఇంతకీ పూరీ ఏం చెప్పాడో ఆయన మాటల్లోనే.. `బుద్ధిజాన్ని ఫాలో అయ్యే వాళ్లను బుద్ధిస్టులు అని పిలుస్తారని మనం చదువుకున్నాం. అయితే, వాళ్ల చేతుల్లో ఎప్పుడూ ఒక పాత్ర ఉంటుంది, దాన్ని మనమందరం చూసే ఉంటాం. దాన్నే బిక్షాటన పాత్ర అంటారు. ఆ పాత్రలో కేవలం ఒకసారి ఒక మనిషికి సరిపోయే ఆహారం మాత్రమే ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ని కనిపెట్టింది బుద్ధుడే. బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్లు, ఒక రోజులో ఒక్కటి లేదా రెండు సార్లు మాత్రమే తింటారు. మిగతా సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోరు. ఉపవాసం ఉంటారు. గిన్నె పెట్టుకుని తినడం వల్ల ఫుడ్ కంట్రోల్డ్ గా తింటారు. మనకు వచ్చే జబ్బులకు కారణం అధికంగా తీసుకునే ఆహారం మాత్రమే. మీరు తిండి తగ్గించాలంటే ఓరియాకీ సెట్ ను వాడండి. అయితే, మనలో చాలామంది తక్కువ తింటే నీరసం వస్తుందని అనుకుంటారు. అలా అనుకోకండి, మీరు బలంగానే ఉంటారు. బుదిస్టులు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటి ఉపవాసాలు మనం కూడా చేస్తే ఎంతో బాగుంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. పూరీ జగన్నాథ్ లిక్ ది బౌల్ కాన్సెప్ట్ పూర్తి వీడియోను ఇక్కడ చూడండి.
Raghu Kunche: మల్టీ టాలెంటెడ్ పర్సన్.. ఐదు నందులు అందుకున్న ప్రతిభాశాలి రఘు కుంచె పుట్టిన రోజు నేడు
Allu Arjun: పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న అల్లు అర్జున్ ఐకాన్ మూవీ..